IPL 2025 : మండు వేసవిలో క్రీడా వినోదాన్నిపంచుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. రెండొదలకు పైగా స్కోర్లతో, ఉత్కంఠ పోరాటాలతో అభిమానులను అలరిస్తుందీ టీ20 లీగ్. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగిన ఐపీఎల్‌పై టెక్ దిగ్గజాలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదండోయ్ ఆయా జట్ల కూర్పు, ఆటగాళ్ల ప్రదర్శనలపై కామెట్లు చేస్తుంటారు. తాజాగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(Sunder Pichai, ).. ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జట్టు కూర్పుపై కామెంట్ చేశారు..
అహ్మదాబాద్‌లో మార్చి 25, సోమవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sunder) ఆడలేదు. దాంతో, ఒక అభిమాని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. భారత జట్టులోని 15 మంది ఉత్తమ ఆటగాళ్లలో సుందర్ ఒకడు. అలాంటి ఆటగాడికి గుజరాత్ తుది జట్టులో చోటు దక్కకపోవడం బాధాకరం’ అని సదరు అభిమాని పోస్ట్ చేయగా.. దానికి సుందర్ పిచాయ్ స్పందించారు.
How Sundar sneaks into the best 15 of India but doesn’t get a place in any IPL XI when 10 teams exist is a mystery
— Pushkar (@Musafirr_hu_yar) March 25, 2025
I have been wondering this too:)
— Sundar Pichai (@sundarpichai) March 25, 2025
‘అవును.. వాళ్లు సుందర్‌ను ఎందుకు బెంచ్‌కే పరిమితం చేశారో నాక్కూడా ఆశ్చర్యంగానే ఉంది’ అని కామెంట్ చేశారు. ఇద్దరి పేర్లలో సుందర్ ఉండడం వల్ల.. పిచాయ్ ఇలా కామెంట్ చేసి ఉంటాడని కొందరు అనుకుంటుండగా.. ఇదంతా ఐపీఎల్ మేనియా.. ఎవరైనా సరే ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడాల్సిందే అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అలహాబాద్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 243 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. గుజరాత్ 232 రన్స్‌కే పరిమితమైంది. ఓటమితో టోర్నీరి ఆరంభించిన శుభ్‌మన్ గిల్ సేన తర్వాతి పోరులో ముంబై ఇండియన్స్‌ను మార్చి 29న ఢీకొట్టనుంది.