IND vs NZ 2nd Test : తొలి టెస్టులో దారుణ పరాభవంతో రగిలిపోతున్న భారత జట్టు పుణే టెస్టు (Pune Test)లో పట్టుబిగిస్తోంది. స్పిన్నర్లు చెలరేగడంతో కివీస్‌ను 259 పరుగులకే ఆలౌట్ చేసింది. సిరీస్ సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో తొలి రోజే కివీస్‌కు కుప్పకూల్చి ఒత్తిడిలో పడేసింది. రంజీల నుంచి వచ్చిన వాషింగ్టన్ సుందర్(7/49) ఏడు వికెట్లతో కివీస్ నడ్డివిరిచాడు. రవిచంద్రన్ అశ్విన్(3/64) సైతం ఓ చేయి వేయడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు తోకముడిచారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. యువ కెరటాలు శుభ్‌మన్ గిల్(10 నాటౌట్), యశస్వీ జైస్వాల్ (6 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.
బెంగళూరు టెస్టులో ఓటమితో తేరుకున్న టీమిండియా పుణేలో పట్టు బిగించేందుకు సిద్దమైంది. స్పిన్ పిచ్‌పై కుర్రాడు వాషింగ్టన్ సుందర్, అశ్విన్‌లు తమ తడాఖా చూపించారు. తొలుత అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టి బ్రేకిస్తే.. ఇక సుందర్ మిడిలార్డర్, టెయిలెండర్ల పని పట్టాడు. అర్ధ శతకాలతో ప్రమాదకరంగా మారిన రచిన్ రవీంద్ర(65)ను బౌల్డ్ చేసి తొలి వికెట్ సాధించిన సుందర్.. వరుసగా చివరి 7 వికెట్లు తీసి తనపై కోచ్, కెప్టెన్లు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సుందర్ ధాటికి డారిల్ మిచెల్(18), టామ్ బ్లండిల్(3), గ్లెన్ ఫిలిఫ్స్(9), శాంట్నర్(33), సౌథీ(5), అజాజ్ పటేల్(4)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
భారత పిచ్‌లపై ఆడిన అనుభవం గల డెవాన్ కాన్వే(76), రచిన్ రవీంద్ర(68)లు మరోసారి కీలక ఇన్నింగ్స్‌తో కివీస్‌ను ఆదుకున్నారు. తొలి సెషన్ మొదలైన కాసేపటికే అశ్విన్ తన తొలి ఓవర్లే టామ్ లాథమ్(15)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత కాన్వే, విల్ యంగ్(18)ల జోడీ క్రీజులో పాతుకుపోయింది. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ జట్టు స్కోర్‌బోర్డును నడిపించారు. అయితే.. అశ్విన్ మరోసారి తన అనుభవాన్ని ఉపయోగించి యంగ్‌ను బోల్తా కొట్టించాడు. అంతే.. 76 వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ పడింది.
FIFER! 👏 👏
Outstanding stuff this is from Washington Sundar! 🙌 🙌
His maiden 5⃣-wicket haul in Test cricket 👍 👍
Live ▶️ https://t.co/YVjSnKCtlI#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/BPt6tPmE5Q
— BCCI (@BCCI) October 24, 2024
ఆ తర్వాత సెషన్ ఆసాంతం కాన్వే, రచిన్ రవీంద్రను భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు. లంచ్ తర్వాత ఇద్దరూ హాఫ్ సెంచరీలతో కివీస్‌కు భరోసానిచ్చారు. కానీ.. సుందర్ పర్యాటక బ్యాటర్లకు షాకిస్తూ వికెట్ల వేట మొదలెట్టాడు. రవీంద్రను బౌల్డ్ చేసిన అతడు.. తనను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని చాటుతూ ఆఖరి 7 వికెట్లను తన ఖాతాలో వేసుకొని రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌లో అత్యుత్తమ టెస్టు గణాంకాలు నమోదు చేసిన మూడో భారత బౌలర్‌గా సుందర్, అశ్విన్ రికార్డును సమం చేశాడు.
ఒక్క పరుగుకే తొలి వికెట్‌గా రోహిత్ శర్మ(0) వెనుదిరిగాడు. సౌథీ బౌలింగ్‌లో డిఫెన్స్ చేయబోయి హిట్‌మ్యాన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్(10 నాటౌట్), యశస్వీ జైస్వాల్(6 నాటౌట్)లు కివీస్ బౌలర్లకు అవకాశమివ్వలేదు. దాంతో, భారత్ వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 243 రన్స్ వెనకబడి ఉంది.
11 wickets fell today in Pune after New Zealand won the toss!https://t.co/3D1D83IgS1 #INDvNZ pic.twitter.com/jJYKmQTaO6
— ESPNcricinfo (@ESPNcricinfo) October 24, 2024