Pushpa 3 | ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2. ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం భారీ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాను డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించింది. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఒక రిపోర్టర్ పుష్ప 2 నిర్మాత రవిశంకర్‌ను అడుగుతూ.. ‘పుష్ప 2’ మాత్రమేనా.. ‘పుష్ప 3’ కూడా ఉంటుందా? అని ప్రశ్న వేస్తాడు.
దీనికి సమాధానంగా.. రవిశంకర్ మాట్లాడుతూ.. పుష్ప 2 హిట్ అయితే పుష్ప 3 ఉంటుందని నిర్మాత నవీన్ పేర్కొన్నారు. పుష్ప 3 కోసం లైన్ కూడా రెడీగా ఉందని అవసరం అనుకుంటే చేసేయడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పుకొచ్చారు. దీంతో పుష్ప 3 కూడా ఉండబోతుందని బన్నీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
There will be a solid lead for #Pushpa3 in #Pushpa2TheRule. Definite ga Part 3 vuntadi
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) October 24, 2024