Cyclone Dana | తీవ్ర తుఫానుగా మారిన దానా.. ఈ రాష్ట్రాలపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందన్న ఐఎండీ..
Cyclone Dana | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తీవ్ర తుఫాపై భారత వాతావరణశాఖ కీలక అప్డేట్ అందించింది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ దిశగా కదులుతూ ఉదయం 8.30 గంటల వరకు పారాదీప్ (Odisha)కు ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో, సాగర్ ద్వీపానికి 310 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైందని భారత వాతావరణశాఖ వెల్లడించింది.
Cyclone Dana | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తీవ్ర తుఫాపై భారత వాతావరణశాఖ కీలక అప్డేట్ అందించింది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ దిశగా కదులుతూ ఉదయం 8.30 గంటల వరకు పారాదీప్ (Odisha)కు ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో, సాగర్ ద్వీపానికి 310 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మధ్యనున్న పూరీ, సాగర్ ద్వీపం మధ్య భితార్కనికా, ధమర దగ్గరలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వేకువ జామున తుఫాను తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. గంటకు 100 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో
గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. తుఫాను ప్రభావం ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై ఉంటుందని ఐఎండీ డీజీ డాక్టర్ మృత్యుంజయ్ మోహపాత్ర పేర్కొన్నారు.
తుఫాను తీరం దాటాక ఉత్తర వాయువ్య దిశగా కదులుతుందని.. దాని ప్రభావంతో దక్షిణ జార్ఖండ్‌లోనూ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. గురు, శుక్రవారాల్లో జార్ఖండ్‌లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించారు. ఇక తీవ్ర తుఫాను నేపథ్యంలో పూరీ బీచ్‌లో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సముద్ర తీర ప్రాంతం నుంచి పర్యాటకులతో పాటు స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రక్ జిల్లాలో బలమైన గాలులు వీస్తున్నాయి. మరో వైపు తుఫాను నేపథ్యంలో భారత నావికాదళం మానవతా దృక్పథంతో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. నౌకాదళ కమాండ్ ఒడిశా, ఏపీ, పశ్చిమ బెంగాల్ అధికారులతో కలిసి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నది. నేవీ సహాయ కార్యక్రమాల్లో సహాయం అందించనున్నారు. అలాగే, అవసరమైతే ఆరోగ్య సేవలను అందించనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

