IPL 2025 : ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలకు అక్టోబర్ 31 ఆఖరు తేదీ. ఈరోజు అంటే గురువారం సాయంత్ర 5:30 కల్లా ఆ ఆరుగురి పేర్లు బీసీసీఐ (BCCI)కి సమర్పించాలి. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు సిద్ధమయ్యయి. ఇక వరుస పెట్టి తమ లిస్ట్‌ను విడుదల చేసే అవకాశముంది. గత సీజన రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) విషయానికొస్తే… రిటైన్ జాబితాలో కీలక మార్పులు చేయనుందని సమాచారం.
‘రైట్ టు మ్యాచ్’తో కలిపి ఆరుగురిని అట్టిపెట్టుకొనేందుకు బీసీసీఐ అవకాశం ఇవ్వడంతో ఎవరిని వదిలేయాలి? అనేదానిపై హైదరాబాద్ యాజమాన్యం కసరత్తు మొదలెట్టింది. గత రెండు సీజన్లలో అదరగొట్టిన చిచ్చరపిడుగు హెన్రిచ్ క్లాసెన్ (Henrich Klassen)కు రూ.23 కోట్లు చెల్లించనుందనే వార్తలు వినిపించాయి. అయితే.. విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను భారీ ధరకు రిటైన్ చేసుకోవాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది.
As per reports, Nitish Kumar Reddy & Abhishek Sharma are the only two capped Indians to be retained by Sunrisers Hyderabad
📷: BCCI#IPLRetention #IPL2025 #SunrisersHyderabad #NitishKumarReddy #AbhishekSharma pic.twitter.com/TXrCToCEBK
— SportsTiger (@The_SportsTiger) October 30, 2024
దూకుడే మంత్రగా ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టే హెడ్‌ను రూ.14 కోట్లకు అట్టిపెట్టుకోవాలని కావ్యా మారన్ టీమ్ అనుకుంటోందట. ఈ ఏడాది మినీ వేలంలో హెడ్‌ను రూ.4 కోట్లకే హైదరాబాద్ కొన్న విషయం తెలిసిందే.ఇక.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)ని రూ. 6 కోట్లకు రిటైన్ చేసుకోవాలని ఎస్ఆర్హెచ్ ఆలోచన. హైదరాబాద్ రిటైన్ చేసుకొనే మిగతా నలుగురిలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins), ఓపెనర్ అభిషేక్ శర్మలతో పాటు హెన్రిచ్ క్లాసెన్‌లు ఉండడం ఖాయం.
సన్‌రైజర్స్ జట్టు డేవిడ్ వార్నర్ సారథ్యంలో 2016లో చాంపియన్‌గా అవతరించింది. ఆ తర్వాత కెప్టెన్లు మారినా ఆ జట్టు కప్ కొట్టలేకపోయింది. అయితే.. కమిన్స్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు 17వ సీజన్లోనూ కప్పు కొట్టేలా కనిపించింది. లీగ్ దశ నుంచి దుమ్మురేపుతూ వచ్చి అనూహ్యంగా ఫైనల్లో చతికిలపడింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) బౌలర్లను ఎదుర్కోలేక 113 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని 10.3 ఓవర్లలోనే ఊదిపడేసిన కోల్‌కతా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.