Ben Stokes | ఇంగ్లండ్ కెప్టెన్ ఇంట్లో దొంగల బీభత్సం.. నగలతో పాటు ఆ మెడల్ ఎత్తుకెళ్లారు
Ben Stokes : పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)కు పెద్ద షాక్. అసలే సిరీస్ ఓటమి బాధలో ఉన్న అతడి ఇంట్లో దొంగలు పడ్డారు. ఎన్నో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. స్టోక్స్ భార్యా పిల్లలు ఇంట్లో ఉండగానే దొంగలు ఈ నేరానికి పాల్పడ్డారు.
Ben Stokes : పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)కు పెద్ద షాక్. అసలే సిరీస్ ఓటమి బాధలో ఉన్న అతడి ఇంట్లో దొంగలు పడ్డారు. ఎన్నో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. స్టోక్స్ భార్యా పిల్లలు ఇంట్లో ఉండగానే దొంగలు ఈ నేరానికి పాల్పడ్డారు. విలువైన నగలు, ఆభరణాలతో పాటు స్టోక్స్‌కు బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ అవార్డును సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. తమ ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని ఇంగ్లండ్ సారథి ఎక్స్ వేదికగా వెల్లడించాడు.
‘అక్టోబర్ 17న నార్త్ ఈస్ట్ కాస్లే ఈడెన్‌లో ఉన్న మా ఇంట్లో మాస్క్‌లు ధరించిన కొందరు చొరబడ్డారు. అప్పుడు నా భార్య కార్లే, పిల్లలు లేటన్, లిబ్బిలు ఇంట్లోనే ఉన్నారు. అయితే.. వాళ్లకు దొంగలు ఏ హానీ తలపెట్టలేదు. కానీ, విలువైన నగలు, ఖరీదైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. నాకు బ్రిటన్ ప్రభుత్వం బహూకరించిన ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ మెడల్ కూడా కనిపించడం లేదు. అదంటే నాకు చాలా ఇష్టం.
APPEAL
On the evening of Thursday 17th October a number of masked people burgled my home in the Castle Eden area in the North East.
They escaped with jewellery, other valuables and a good deal of personal items. Many of those items have real sentimental value for me and my…
— Ben Stokes (@benstokes38) October 30, 2024
దొంగలు ఎత్తుకెళ్లిన చాలా వస్తువులు మాకు ఎంతో అమూల్యం. ఈ నేరానికి పాల్పడ్డ వాళ్లను వెంటనే పట్టుకోవాలి’ అని స్టోక్స్ ఎక్స్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక.. రెండు నెలల తర్వాత జట్టుతో కలిసిన స్టోక్స్ పాకిస్థాన్ పర్యటనలో విఫలమయ్యాడు. చివరి రెండు టెస్టుల్లో అతడి సారథ్యంలోని ఇంగ్లండ్ చిత్తుగా ఓడింది. పాకిస్థాన్ స్పిన్నర్ల ధాటికి నిలువలేక 1-2తో సిరీస్ పోగొట్టుకుంది.
ఇవి కూడా చదవండి
- Air Pollution | దీపావళి రోజున ఢిల్లీలో కాలుష్యం.. ఆనంద్ విహార్‌ను కమ్మేసిన పొగమంచు
- BR Naidu | భక్తులకు గంటలోగా దర్శనం కావాలి.. ఇదే నా ఆలోచన : టీటీడీ కొత్త చైర్మన్ బీఆర్ నాయుడు
- Air India | ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. 60 యూఎస్‌కు విమానాలు రద్దు..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karmabhoomi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న నాలుగు బోగీలు
Scene Review | ‘సీన్’ సినిమా రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే!
Former Minister Talasani | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి : మాజీ మంత్రి తలసాని
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

