Air India | ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. 60 యూఎస్‌కు విమానాలు రద్దు..!
Air India | టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ కంపెనీ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మధ్య భారత్ నుంచి యూఎస్‌కు నడవాల్సిన 60 విమానాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Air India | టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ కంపెనీ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మధ్య భారత్ నుంచి యూఎస్‌కు నడవాల్సిన 60 విమానాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్వహణ సమస్యల కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఆయా విమానాలను రద్దు చేసినట్లు పేర్కొన్నాయి. పీక్ ట్రావెల్ పీరియడ్‌లో రద్దయిన విమానాల్లో ఎక్కువగా శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో విమాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పాయి. విమానాల రద్దుకు సంబంధించిన ఆయా ప్రయాణికులకు సమాచారం అందించినట్లు ఎయిర్‌లైన్ పేర్కొంది.
ఎయిర్ ఇండియా గ్రూప్ ద్వారా నడుస్తున్న ఇతర విమానాల్లో తర్వాతి రోజులకు సర్వీస్‌ని ఆఫ్ చేసినట్లు సంస్థ తెలిపింది. అయితే, ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ కోసం పంపుతున్న ఎంఆర్వో ఆపరేటర్ నుంచి విమానాలను తిరిగి పొందడంలో జాప్యం జరుగుతున్నది. సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని వైడ్‌బాడీ విమానాలను సైతం నిలిచిపోయాయి. ఫలితంగా విమానాలకు కొరత ఏర్పడుతున్నది. తత్ఫలితంగా విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. విమానాల రద్దుపై ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది. రద్దయిన విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు సమాచారం అందించామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. విమానాలు రద్దయిన నేపథ్యంలో ఉచితంగా డేట్‌ను మార్చుకునేలా అవకాశం కల్పించడంతో పాటు పూర్తిగా టికెట్ డబ్బులను రీఫండ్ చేయనున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేస్తోందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ప్రస్తుతం ఢిల్లీ – వాషింగ్టన్ మధ్య ఐదు విమానాలను నడుపుతున్నది. ఢిల్లీ-న్యూయార్క్, ముంబయి – న్యూయార్క్ రూట్లలో వారానికి ఏడు విమానాలు నడుపుతున్నది. ఢిల్లీ-చికాగో రూట్లో వారానికి ఏడు, ఢిల్లీ–వాషింగ్టన్ రూట్లో 28, ఢిల్లీ–శాన్ఫ్రాన్సిస్కో మధ్య 12 విమానాలు, ముంబయి – న్యూయార్క్ మార్గంలో నాలుగు విమానాలు, ఢిల్లీ – నెవార్క్ రూట్లో రెండు విమానాలను నడుపుతున్నది. ముంబయితో పాటు బెంగళూరు నుంచి వారానికి నాలుగు విమానాలను నడుపుతోంది. అంతేకాకుండా, ఎయిర్ ఇండియా ఢిల్లీ, ముంబయి నుంచి నెవార్క్‌కు వారానికి మూడు విమానాలను కూడా నడుపుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

