ICC : టెస్టు మ్యాచ్ అనగానే ఐదు రోజుల ఆట అని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. అయితే.. ఈసారి వాళ్ల సమాధానం తప్పు కానుంది. అవును.. శ్రీలంక(Srilanka), న్యూజిలాండ్(Newzealand) జట్ల మధ్య ఆరు రోజుల టెస్టు జరుగనుంది. సెప్టెంబర్లో ఈ మ్యాచ్ను నిర్వహిస్తామని శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తెలిపింది. దాంతో, అభిమానులు సుదీర్ఘ ఫార్మాట్లో ఆరు రోజుల మ్యాచా? అసలు ఏమైం ఉంటుంది? అని షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే..?
రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు సెప్టెంబర్లో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య సెప్టెంబర్ 18న గాలే స్టేడియంలో తొలి మ్యాజ్ జరుగనుంది. అయితే.. షెడ్యూల్ ప్రకారం ఐదు రోజల్లో 22వ తేదీన మ్యాచ్ ముగియాలి. కానీ ఈ టెస్టు 23న పూర్తి కానుంది.
A rest day during the first #SLvNZ match 👀
Sri Lanka have confirmed the dates for hosting New Zealand for the #WTC25 Tests 👇https://t.co/l2IimGLqSy
— ICC (@ICC) August 23, 2024
మొదటి టెస్టు సమయంలో సెప్టెంబర్ 21న శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. అందుకని ఆ రోజును ఐసీసీ రిజర్వ్ డేగా ప్రకటించింది. దాంతో, దాదాపు 23 ఏండ్ల తర్వాత మళ్లీ లంక ఆరు రోజులు ఆడబోతోంది. ఇంతకుముందు 2001లో పోయా డే (ఫుల్ మూన్ డే) సందర్బంగా జింబాబ్వేతో లంక ఆరు రోజుల టెస్టు మ్యాచ్ ఆడింది. ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) పట్టికలో కివీస్, శ్రీలంకలు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. డబ్ల్యూటీసీ(2024-25) ఫైనల్ కోసం ఈ సిరీస్ ఇరుజట్లకు కీలకం కానుంది.