Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా అతడు నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవ్వడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ థియేటర్లలో పండగా చేసుకున్నారు. కొన్ని రోజులుగా మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లన్ని ఇంద్ర ఎఫెక్ట్‌తో తెరచుకున్నాయి. అయితే ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడంతో పాటు 22 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర టీంను ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు.
‘ఇంద్ర’ క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేస్తూ 22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్స్ లో రిలీజ్ అయిన సందర్భంగా, ‘ఇంద్ర’ టీంకి ‘చిరు’ సత్కారం చేశాను. ఇంద్రను ఇంత సక్సెస్ చేసిన ప్రొడ్యూసర్ అశ్విన్ దత్, దర్శకుడు బీ గోపాల్, మరపురాని డైలాగ్స్ ని అందించిన పరచూరి బ్రదర్స్, కథనందించిన చిన్ని క్రిష్ణ, మ్యూజిక్ అందించిన మణిశర్మలకు ధన్యవాదాలు అంటూ చిరు రాసుకోచ్చాడు.
‘ఇంద్ర’ క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేస్తూ
22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్స్ లో రిలీజ్ అయిన సందర్భంగా, ‘ఇంద్ర’ టీంకి ‘చిరు’ సత్కారం!
అలాగే ప్రొడ్యూసర్ @AshwiniduttCh గారు, డైరెక్టర్ B.Gopal, మరపురాని డైలాగ్స్ ని అందించిన #ParuchuriBrothers , కధనందించిన చిన్ని క్రిష్ణ,… pic.twitter.com/UfGpOd2gkE— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2024