జార్ఖండ్ రాజధాని రాంచి రణరంగమైంది. నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బీజేపీ యువమోర్చా నేతల ఆందోళనపై పోలీసులు విరుచుకుపడ్డారు. నిరసన ప్రదర్శనలను అడుగడుగునా అడ్డగించి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించడంతో పాటు లాఠీలకు పనిచెప్పారు.
బీజేపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా, సమస్యలపై యువత కదం తొక్కడంతో జార్ఖండ్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం సర్కార్ దిక్కుతోచని స్ధితిలోకి వెళ్లిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యాయం కోసం పోరుబాట పట్టిన యువతపై లాఠీచార్జితో సోరెన్ సర్కార్ విరుచుకుపడిందని విమర్శించారు.
#WATCH | Police use water cannon and tear gas to disperse BJP workers and members of BJP Yuva Morcha protesting against the Jharkhand government, in Ranchi pic.twitter.com/L0wStoY5JF
— ANI (@ANI) August 23, 2024
నిరుద్యోగ యువతను నిలువరించి లాఠీచార్జి చేశారని ఆరోపించారు. హేమంత్ సోరెన్ సర్కార్కు నూకలు చెల్లాయని ఈ ప్రభుత్వం రెండు నెలల్లో దిగిపోతుందని దుయ్యబట్టారు. ఐదు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. దీనిపై బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ఆందోళన చేపడితే జేఎంఎం విధ్వంసానికి తెగబడిందని అన్నారు.
Read More :
Megha Akash | ఆరేండ్ల ప్రేమ.. ప్రియుడితో మేఘా ఆకాశ్ ఎంగేజ్మెంట్