SL vs NZ 2nd Test : సొంతగడ్డపై తొలి టెస్టులో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన శ్రీలంక (Srilanka).. రెండో టెస్టులోనూ తడాఖా చూపించింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ విజేత అయిన కివీస్‌పై భారీ తేడాతో విజయ గర్జన చేసింది. అరంగేట్ర ఆఫ్ స్పిన్నర్ నిషాన్ పెరిస్(6/170), పపేసర్ ప్రభాత్ జయసూర్య(3/139)లు విజృంభించడంతో కివీస్‌పై భారీ విజయం సాధించింది. తొలి టెస్టులో 63 రన్స్‌తో గెలుపొందని లంక.. ఇప్పుడు ఏకంగా ఇన్నింగ్స్ 154 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన ధనంజయ డిసిల్వా బృందం 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2024-25) పట్టికలో మూడో స్థానాన్ని సంపాదించింది.
గాలే స్టేడియంలో శ్రీలంక బౌలర్లు ఓ రేంజ్లో చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లను వణికిస్తూ 88 పరుగులకే ఆ జట్టును కట్టడి చేశారు. అరంగేట్ర స్పిన్నర్ నిషాన్ పెరిస్(6/170) గింగిరాలు తిప్పే బంతులతో కివీస్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ మ్యాజిక్ చేస్తూ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఫాలో ఆన్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మూడో రోజు 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
Nishan Peiris takes six as New Zealand are bowled out for 360 in their second innings; Sri Lanka complete a 2-0 series sweep with an emphatic innings win 👏 https://t.co/mD2JJ1p0rx #SLvNZ pic.twitter.com/uK8l5dWRZ4
— ESPNcricinfo (@ESPNcricinfo) September 29, 2024
ఇన్నింగ్స్ మొదలెట్టిన కాసేపటికే ఆలౌట్ ప్రమాదంలో పడిన జట్టును ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్(78), వికెట్ కీపర్ టామ్ బ్లండెల్(60)తో కలిసి ఆదుకున్నాడు. దాంతో, నాలుగో రోజుకు వెళ్లింది. లంక బౌలర్లను విసిగిస్తూ అర్ధ శతకాలు బాదిన ఈ ఇద్దరిని నిషాన్ డగౌట్‌కు పంపాడు.
Nishan Peiris ends a positive knock from Tom Blundell – gets his fourth & Sri Lanka are four away https://t.co/1O6bJFOzdA | #SLvNZ pic.twitter.com/j40Zzptbky
— ESPNcricinfo (@ESPNcricinfo) September 29, 2024
ఆ తర్వాత హాఫ్ సెంచరీతో మెరిసిన మిచెల్ శాంట్నర్(67)ను సైతం ఔట్ చేసి ఆరో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ప్రభాత్ జయసూర్య(3/139) సైతం మూడో వికెట్లతో పర్యాజట జట్టు పతనాన్ని శాసించాడు. దాంతో, న్యూజిలాండ్ 360కే ఆలౌట్ అయి… ఇన్నింగ్స్ 154 పరుగుల భారీ ఓటమి మూటగట్టుకుంది.
రెండో టెస్టులో శ్రీలంక బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. మూడింటా అదరగొట్టింది. మొదట ఓపెనర్ దినేశ్ చండిమల్(116) శతకంతో భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. అనంతరం కమిందు మెండిస్(182 నాటౌట్ : 250 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లు), కుశాల్ మెండిస్ (106 నాటౌట్)లు ఆకాశమే హద్దుగా న్యూజిలాండ్ బౌలర్లను ఉతికేశారు. బౌండరీలతో విరుచుకుపడి లంక స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
Sri Lanka join a rare set of XIs in the history of Test cricket 🙌 #SLvNZ
(h/t @Prithvi10_) pic.twitter.com/0qZuzpr8iA
— ESPNcricinfo (@ESPNcricinfo) September 29, 2024
ఈ క్రమంలోనే కమిందు టెస్టుల్లో 1,000 పరుగుల మైలురాయికి చేరుకొని చరిత్ర సృష్టించాడు. కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి క్లబ్లో చేరి క్రికెట్ లెజెండ్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. చండిమల్, కమిందు, కుశాల్ భారీ శతకాలతో కొండంత స్కోర్ కొట్టిన లంక 602-5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.