Dhanush కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఓ వైపు హీరోగా, మరోవైపు డైరెక్టర్‌గా వరుస సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ధనుష్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. స్టార్ డైరెక్టర్ మారి సెల్వరాజ్
(Mari Selvaraj) ధనుష్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఓ చిట్‌చాట్‌లో చెప్పాడీ డైరెక్టర్. ధనుష్‌తో చేయబోయే సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో సినిమా ఉండబోతుంది.
ఈ సినిమా పూర్తి చేసేందుకు సుమారు ఏడాదిన్నర సమయం పడుతుందని చెప్పాడు. మొత్తానికి ధనుష్‌ను ఈ సారి వారియర్‌గా చూపించబోతున్నాడంటూ తెగ చర్చ నడుస్తోంది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు.ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. అంటూ చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో ధనుష్ నవ్వుతూ కనిపిస్తున్న లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది. మరోవైపు ధనుష్ డైరెక్టర్ కమ్ హీరోగా DD4 చేస్తున్నాడు. ఇడ్లీ కడై టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో నిత్యమీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అరుణ్ విజయ్, సత్యరాజ్, అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆకాశ్ (డెబ్యూ) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. రాంజానా, అట్రాంగి రే తర్వాత ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్.
#MariSelvaraj Recent
– MariSelvaraj is going to do a film with #Dhanush next.
– This film is going to come in a historical background.
– It took a year and a half to complete this film.
– This will be my dream movie.#Kubera #NEEK #IdlyKadai #Bisonpic.twitter.com/mEV4vEUNOq— Movie Tamil (@MovieTamil4) September 29, 2024
Zebra | సత్యదేవ్‌కు సపోర్ట్‌గా నాని.. జీబ్రా టీజర్ టైం చెప్పేశారు
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?