SL vs NZ 1st Test : శ్రీలంక, న్యూజిలాండ్‌ల మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టు వాయిదా పడింది. గాలే స్టేడియంలో నాలుగో రోజు ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలోకి రాలేదు. తిరిగి సెప్టెంబర్ 22, ఆదివారం యాథావిధిగా మ్యాచ్ మొదలవ్వనుంది. అంటే.. ఆరు రోజుల టెస్టు మ్యాచ్ అన్నమాట. అదేంటీ? సుదీర్ఘ ఫార్మాట్లో ఐదు రోజులే కదా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే.. మీరు అందుకు కారణం ఉందిలేండి.
అదేంటంటే.? శ్రీలంకలో శనివారం అధ్యక్ష ఎన్నికలు(Srilanka President Elections) ఉన్నాయి. అందుకని లంక క్రికెటర్లతో పాటు కోచింగ్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ‘రెస్ట్ డే’గా ప్రకటించారు. ఈ విషయాన్నిలంక బోర్డు ఐసీసీకి ఇదివరకే విన్నవించింది. గతంలో కూడా ఓసారి లంక ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్ ఆడింది. శ్రీలంక జట్టు 2008లో టెస్టు సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలోనే అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగడంతో ఆరు రోజుల టెస్టు ఆడింది.
Day four of the match will resume on Sunday.
This is the first time in 16 years that a Test has a rest day in between.#SLvsNZ pic.twitter.com/7Z7ARm0Xeg
— kalpesh Prajapati (@kalpesh_6355) September 21, 2024
ఈమధ్యే ఇంగ్లండ్‌పై ఓవల్ స్టేడియంలో చారిత్రక విజయం సాధించిన లంక స్వదేశంలో అదరగొడుతోంది. న్యూజిలాండ్‌పై 202 పరుగుల ఆధిక్యం సంపాదించింది. తొలి ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్(114) సెంచరీతో కోలుకున్న ఆతిథ్య జట్టు 305 పరుగులకు ఆలౌటయ్యింది. అనంతరం కివీస్‌ను 340కే కట్టడి చేసిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 237 రన్స్ కొట్టింది. మూడో రోజు ఆట ముగిసే సరికి కెప్టెన్ ధనంజయ డిసిల్వా(34 నాటౌట్), వెటరన్ ఆల్‌రౌండర్ ఎంజెలో మాథ్యూస్(34 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు.
కమిందు మెండిస్(114)