AP News | ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. తన మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రసాదంలో ఏ కల్తీ లేదని, కల్తీ అంతా నీ బుర్ర, మనసులోనే ఉందని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఆరోపణలే తప్ప నీ జీవితంలో నిరూపణలు ఉండవని ఎద్దేవా చేశారు.
డబ్బు సంపాదన కోసమే నీకు అధికారం తప్ప ప్రజల కోసం కాదని చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి అన్నారు. ఆ డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేస్తావని విమర్శించారు. విలువలకు ఎన్నడో వలువలు ఊడ్చిన నువ్వు ఒక్క మనిషివేనా అని తీవ్ర విమర్శలు చేశారు. దేవదేవుడు నిన్ను ఎప్పటికీ క్షమించడని అన్నారు. కలియుగంలో నీ అంత పాపం ఎవరూ చేసి ఉండరని అన్నారు. నీ ప్రవర్తనతో రావణాసురుడు, కంసుడు, కీచకుడు సిగ్గుపడేలా చేశావని వ్యాఖ్యానించారు. నీలాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు జాతి దురదృష్టమని విమర్శించారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సూపర్ సిక్స్ హామీలు ఇవే అంటూ విజయసాయి రెడ్డి సెటైర్లు వేస్తూ ఒక ట్వీట్ చేశారు.
1. సామూహిక హింసకు ప్రేరేపించి వైసీపీ మద్దతుదారులను హత్య చేయించారు.
2. మూడు నెలల్లోనే 19 వేల కోట్లను అప్పు తీసుకొచ్చారు.
3. కీలక సంక్షేమ పథకాలను నిలిపివేశారు.
4. కృష్ణా నది కరకట్టపై ఉన్న తన అక్రమ నివాసాన్ని కాపాడుకోవడం కోసం విజయవాడ వరదలకు కారణమయ్యారు.
5. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా మూడింటిలో రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లను మూసివేశారు.
6. తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీటీడీ లడ్డూలపై నిరాధారమైన దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు.
చంద్రబాబు నాయుడు నిఖార్సయిన నాయకుడైతే ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అంబటి రాంబాబు డిమాండ్‌చేశారు.
~ తిరుమల వెయ్యి కాళ్ల మండపం ఎందుకు కూల్చావు.
~ విజయవాడలో 50కు పైగా ఆలయాలను ఎందుకు కూల్చావు.
~ దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు ఎందుకు చేశావు.
~ బూట్లు వేసుకుని ఎందుకు పూజలు చేస్తావు.
~ రాష్ట్రంలో విగ్రహాలు ధ్వసం చేసి మాపై నిందలు ఎందుకు వేశావు.
~ పవిత్రమైన లడ్డూ ప్రసాదం మీద ఎందుకు విషప్రచారం చేశావు.
~ నీలాంటి దుర్మార్గుడిని బహిష్కరిస్తే గానీ సమాజం బాగుపడదు.
~ ప్రసాదం స్వీకరించే ప్రతి భక్తుడు నిన్ను చీ కొడుతున్నాడు.
~ ప్రసాదంలో ఏ కల్తీ లేదు, కల్తీ అంతా నీ బుర్ర, మనసు నీ చరిత్ర, నీ మానసిక రుగ్మత.
~ ఆరోపణలే తప్ప నీ జీవితంలో నిరూపణలు వుండవు.
~ బట్ట కాల్చి ముఖానవేసి ప్రత్యర్థిని తుడుచుకో అంటావు.
~ నీ అధికారం నీ డబ్బు సంపాదన కోసమే తప్ప ప్రజలకోసం మాత్రం కాదు.
~ ఆ డబ్బుతో వ్యవస్థలను మానేజ్ చేస్తావు.
~ విలువలకు ఎన్నడో వలువలు ఊడ్చిన నువ్వు ఒక మనిషివేనా!
~ దేవదేవుడు నిన్ను ఎప్పటికి క్షమించడు.
~ కలియుగంలో నీ అంత పాపం ఎవరూ చేసి ఉండరు.
~ నీ ప్రవర్తనతో రావణాసురుడు, కంసుడు, కీచకుడు సిగ్గుపడేలా చేశావు.
~ నీలాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు జాతి దురదృష్టం.