Rishabh Pant : భారత జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) టెస్టుల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలైమన పంత్.. చెపాక్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో విజృంభించాడు. ఒంటిచేతి విన్యాసాలతో అలరించిన పంత్ టీమిండియాను పటిష్ఠ స్థితిలో నిలిపాడు. అంతేకాదండోయ్.. 2019లో మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) మాదిరిగానే అతడూ కాసేపు బంగ్లాదేశ్ కెప్టెన్ తానే అన్నట్టుగా ప్రవర్తించాడు. అవును.. మ్యాచ్ మధ్యలో పంత్ ఫీల్డింగ్ సెట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మైదానంలో కుదురుగా ఉండడం అంటే పంత్‌కు నచ్చదు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ఏదైనా సరే తెగ ఆస్వాదిస్తాడు. చెపాక్ టెస్టులో మూడో రోజు పంత్ ఏకంగా బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ సెట్ చేశాడు. 23 పరుగుల వద్ద ఉన్న పంత్.. ప్రత్యర్థి కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో వైపు చూస్తూ.. ‘ఇక్కడ చూడు. లెగ్ సైడ్ ఓ ఫీల్డర్ తగ్గాడు’ అని కేక వేశాడు.
Here’s the video 😂pic.twitter.com/aeCJpEBDsI
— Diamond (@DiamondTheHeera) September 21, 2024
అంతే.. శాంటో వెంటనే ఓ ఫీల్డర్‌ను అక్కడికి పంపాడు. ఆ తర్వాత పంత్ మళ్లీ యథావిధిగా బ్యాటింగ్ కొనసాగించి చిరస్మరణీయ శతకం బాదాడు. ఆరో శతకంతో ధోనీ రికార్డును సైతం పంత్ సమం చేశాడు.శుభ్‌మన్ గిల్(119 నాటౌట్)తో కలిసి రికార్డు భాగస్వామ్యంతో టీమిండియాను పటిష్ఠ స్థితిలో నిలిపాడు.
2019: MS Dhoni sets field for Bangladesh
2024: Rishabh Pant sets field for Bangladesh pic.twitter.com/J7IQRMrkjz— Johns (@JohnyBravo183) September 21, 2024
చెపాక్ టెస్టులో పట్టుబిగించిన టీమిండియా విజయానికి చేరువైంది. రెండో రోజు జస్ప్రీత్ బుమ్రా(450) ధాటికి కుప్పకూలిన బంగ్లాదేశ్‌ను మూడో రోజు శుభ్‌మన్ గిల్(119 నాటౌట్), రిషభ్ పంత్(109)లు శతకాలతో బెంబేలెత్తించారు. వీళ్లిద్దరి రికార్డు భాగస్వామ్యం అనంతరం భారీ ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ అప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయింది.
రిషభ్ పంత్(109), శుభ్‌మన్ గిల్(119 నాటౌట్)
అయితే.. మరో 10 ఓవర్లు ఉన్నాయనగా వెలుతురు తగ్గపోయింది. మేఘాలు కూడా కమ్ముకోవడంతో అంపైర్లు ఆట ముగిసిందని చెప్పారు. అప్పటికీ బంగ్లా స్కోర్.. 158 కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(51), షకీబుల్ హసన్(5)లు నాటౌట్‌గా క్రీజును వీడారు. భారత జట్టు విజయానికి ఆరు వికెట్లు అవసరం కాగా.. బంగ్లా ఇంకా 357 రన్స్ కొట్టాలి. నాలుగో రోజు తొలి సెషన్లో బుమ్రా నేతృత్వంలోని టీమిండియా పేస్ దళాన్ని బంగ్లా బ్యాటర్లు ఏమేరకు ఎదుర్కొంటారో చూడాలి.