Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో మరో జీవిత కాల గరిష్ట రికార్డు నమోదైంది. ఈ నెల 13వ తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 223 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 689.46 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లిందని ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
కానీ, ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) మాత్రం 515 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 603.63 బిలియన్ డాలర్లతో సరి పెట్టుకున్నాయి. బంగారం రిజర్వ్ నిల్వలు 899 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 62.8 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. మరోవైపు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్ఎస్) 53 మిలియన్ డాలర్లు క్షీణించి 18.42 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 108 మిలియన్ డాలర్లు పడిపోయి 4.52 బిలియన్ డాలర్లకు చేరాయి.