Bigg Boss Telugu 8 | బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ 20వ రోజుకి చేరుకుంది. ఇప్పటికే మొదటివారం హౌస్ నుంచి బేబక్క ఎలిమినేషన్ అవ్వగా.. రెండవవారం శేఖర్ భాషా హౌస్ నుంచి ఎలిమినేషన్ అయ్యాడు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులతో పాటు బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నేడు బిగ్ బాస్‌లో జరిగే స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమోను విడుదల చేశారు నిర్వహాకులు. ఈ ప్రోమోలో కంటెస్టెంట్ అభయ్ బిగ్‌బాస్‌ను పిచ్చి తిట్టుడు తిట్టడం ప్రోమోలో చూడవచ్చు.
బిగ్ బాస్‌లో గుడ్ల టాస్క్ ముగిసిన అనంతరం అభయ్ తన రూమ్‌కి వెళ్లి కూడా బిగ్ బాస్‌ను తిట్టడం ఆపలేదు. బిగ్‌బాస్ కాదు నువ్వు బయాస్డ్ (పక్షపాతం) బాస్.. నేను మాట్లాడింది కట్ చేస్తారేమో కానీ నేను బయటకెళ్లాక ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తా.. నిజంగా ధమాక్ లేదు నీకు.. ఒకడికి రూల్ ఇచ్చి ఇంకొకడి ఇవ్వకుండా.. ఇదేం పనికిమాలిన గేమ్ నాకు అర్థం కాలేదు.. నిద్రపోయిండా.. లేక గతం ఏమైనా మర్చిపోయిండా.. బొక్కలో ట్విస్ట్‌లు నువ్వు.. లిమిట్ లెస్ బయాస్డ్ బిగ్‌బాస్.. అంటూ అభయ్ తిట్టాడు.
అయితే బిగ్ బాస్‌ను తిట్టిన అభయ్కు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా రెడ్ కార్డు ఇచ్చి బయటకు వెళ్లిపోమ్మన్నాడు నాగార్జున. ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ బిగ్ బాస్ రూల్సే ఉంటాయి. బిగ్ బాస్ పై రెస్పెక్ట్ లేకపోతే వెళ్లిపోవచ్చు. నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నా.. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్.. అభయ్ గెటౌట్ అంటూ నాగార్జున ప్రోమోలో చెప్పడం చూడవచ్చు.