SL vs AUS : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఉన్న శ్రీలంక, ఆస్ట్రేలియాల మధ్య కీలకమైన టెస్ట్ సిరీస్ జరుగనుంది. వచ్చే ఏడాది లంక పర్యటనలో ఆసీస్ రెండు టెస్టులతో పాట ఒక వన్డే ఆడనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, శ్రీలంకలకు ఇది చాలా ముఖ్యమైన సిరీస్. అందుకని శ్రీలంక బోర్డు శుక్రవారం సిరీస్ షెడ్యూల్ విడుదల చేసింది.
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియాను ధనంజయ డిసిల్వా నేతృత్వంలోని లంక ఢీ కొట్టనుంది. ఇరుజట్ల మధ్య గాలే వేదిగా జనవరి 29వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. అనంతరం అదే మైదానంలో ఫిబ్రవరి 6వ తేదీన ఆసీస్, లంక జట్లు రెండో టెస్టులో ఢీకొట్టనున్నాయి. టెస్టు సిరీస్ ముగిశాక ఫిబ్రవరి 13న ఏకైక వన్డే నిర్వహించనున్నారు.
A two-Test series which could have some say in that #WTC table🍿
First Test starts January 29, and the second on February 6 – both in Galle
Read more: https://t.co/0IAIIZftF1 | #SLvAUS pic.twitter.com/UHfBCNLmhs
— ESPNcricinfo (@ESPNcricinfo) November 1, 2024
మొన్నటిదాకా డబ్ల్యూటీసీ పట్టికలో వెనకబడిన శ్రీలంక అనూహ్యంగా మూడో స్థానానికి దూసుకొచ్చింది. స్వదేశంలో న్యూజిలాండ్‌ను 2-0తో వైట్‌వాష్ చేసి పోటీలో నిలిచింది. ఇక మొదటి నుంచి రెండో స్థానంలో ఉన్న ఆసీస్ వరుసగా రెండోసారి ఫైనల్‌పై గురి పెట్టింది. భారత జట్టుతో జరగనున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో కమిన్స్ సేన చెలరేగితే మళ్లీ టెస్టు గద పోరులో ఆస్ట్రేలియా ఆడడం ఖాయం. ఒకవేళ కంగారు జట్టు చేతిలో లంక ఓడితే.. నాలుగో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు చాన్స్ ఉంటుంది.
South Africa’s win in Chattogram helped them leap over New Zealand in #WTC25 standings 💪#BANvSA pic.twitter.com/I2FoZmuNmQ
— ICC (@ICC) October 31, 2024
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత జట్టు హ్యాట్రిక్ ఫైనల్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆఖరిదైన ముంబై టెస్టులో కివీస్‌ను చిత్తు చేయాలి. అదీ కాకుండా నవంబర్‌లో ఆస్ట్రేలియా గడ్డమీద జరుగబోయే ఐదు మ్యాచ్‌ల బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో జయకేతనం ఎగురువేయాలి. లేదంటే.. ముంబై టెస్టుతో కలిపి కనీసం నాలుగు మ్యాచులు గెలిచి.. ఒక్కటి డ్రా చేసుకోవాలి. అప్పుడే ఫైనల్ అవకాశాలు మెరుగుపడుతాయి.