TGSRTC | కురుమూర్తి స్వామి జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయి.
కురుమూర్తి జాతరలో ప్రధాన ఘట్మైన ఉద్దాల ఉత్సవం ఈ నెల 8వ తేదీన ఉంది. దీంతో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ అందుబాటులో ఉంచుతుంది. ఎంజీబీఎస్ – ఆరాంఘర్ – మహబూబ్నగర్ మీదుగా ఈ బస్సులు జాతరకు వెళ్తాయి.
కురుమూర్తి జాతరకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో టీజీఎస్ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్లను కల్పిస్తోంది. టికెట్ల బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్సైట్ సంప్రదించగలరు. ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకుని కురుమూర్తి స్వామిని దర్శించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది.