Malaysia Masters : ప్రతిష్ఠాత్మక మలేషియా మాస్టర్స్ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) పతకానికి మరింత చేరువయ్యాడు. తనకంటే మెరుగైన ర్యాంకర్లకు చెక్ పెడుతూ వస్తున్న భారత షట్లర్.. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జయకేతనం ఎగురవేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన తొమా జూనియర్ పొపోవ్ (Toma Junior Popov)ను మట్టికరిపిస్తూ సెమీస్‌కు దూసుకెళ్లాడీ ఈ మాజీ వరల్డ్ నంబర్ 1. దాంతో, ఏడాది తర్వాత అతడు ఒక టోర్నీలో సెమీఫైనల్ ఆడబోతున్నాడు.
పస్తుతం 65వ ర్యాంక్‌లో కొనసాగుతున్న శ్రీకాంత్ సంచలన ఆటతో వరుసపెట్టి ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నాడు. ప్రీ- క్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ను చిత్తు చేసిన అతడు .. ఈసారి 18వ ర్యాంకర్‌ను ఇంటిదారి పట్టించాడు. మూడు సెట్ల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ పట్టు విడవలేదు. తొలి సెట్ తర్వాత ప్రత్యర్థి పుంజుకున్నా తన పోరాట పటిమతో ఆకట్టుకున్న భారత స్టార్ చివరకు 24-22, 17-21, 221-20తో విజేతగా నిలిచాడు. తదుపరి రౌండ్లో శ్రీకాంత్‌కు జపాన్‌కు చెందిన యుషీ తనక(Yushi Tanaka) రూపంలో కఠినమైన సవాల్ ఎదురుకానుంది.
SRIKANTH KIDAMBI STORMS INTO SEMIS 🤩
He defeated Popov 🇫🇷 24-22 , 17-21 , 22-20 to reach Semis Of BWF Malaysia Masters 2025!
LOOK AT THE CELEBRATION BY HIM 🦁💪
pic.twitter.com/PNF0zCqlpz— The Khel India (@TheKhelIndia) May 23, 2025
పురుషుల సింగిల్స్‌లో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన భారత కుర్రాళ్లు హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy), ఆయుశ్ శెట్టి, కరుణాకరన్‌లు ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. ఇక మహిళల 16వ రౌండ్ డబుల్స్ మ్యాచ్‌లో ప్రేరణా అల్వేకర్, మృణ్మయి దేశ్‌పాండే ద్వయం పోరాటం ముగియగా.. ఒలింపిక్ విజేత పీవీ సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది.