Illegal coal mine : అక్రమ బొగ్గుగని (Illegal coal mine) లోకి నది నీళ్లు (River water) చేరడంతో ఆ గనిలో పనిచేస్తున్న వాళ్లలో ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. జార్ఖండ్ రాష్ట్రం (Jharkhand state) హజారీబాగ్ (Hazaribagh) జిల్లాలోని బరియాటు ఖావా (Bariatu Khawa) ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు గాలింపు కొనసాగుతోంది.
ఖావా నదిలో ముగ్గురు కూలీలు గల్లంతైనట్లు గురువారం సాయంత్రం తమకు సమాచారం అందిందని స్థానిక పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే తాను ఘటనా ప్రాంతానికి వెళ్లి చూశామని, అక్కడ ఒక భారీ గుంత ఉన్నదని తెలిపారు. దాన్నిబట్టి ఆ ప్రాంతంలో అక్రమంగా బొగ్గు తవ్వకం జరుగుతున్నదనే విషయం స్పష్టమవుతోందని చెప్పారు. ప్రస్తుతం నదిలో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని అన్నారు.
ప్రత్యేక మిషన్ ద్వారా అక్రమ మైనింగ్ గుంతలోని నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నీరు తొలగిపోతే మృతదేహాలు దొరికే ఛాన్స్ ఉందని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
#WATCH | Hazaribagh, Jharkhand: 3 people died after river water entered an illegal coal mine in Bariatu Khawa; Search operation is underway
CO Ram Ratan Barnwal said, “We received information late in the evening that 3 workers were swept away in the Khawa river…We saw a pit… pic.twitter.com/rO5PhcjXSB
— ANI (@ANI) May 23, 2025