Golconda Bonalu | మెహిదీపట్నం, మే 23 : ఆషాఢ మాసంలో జరిగే చారిత్రాత్మక గోల్కొండ బోనాలను ఘనంగా నిర్వహించడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఉత్సవ కమిటీ చైర్మన్ కె.చంటిబాబు తెలిపారు. గోల్కొండ కోట జగదాంబ ఎల్లమ్మ ఆలయం ఆవరణలో ఉత్సవ కమిటీ సభ్యులుగా నియమితులైన ఏడుగురితో ఆలయ ఈవో వసంత ప్రమాణస్వీకారంచేయించారు. లంగర్‌హౌజ్‌కు చెందిన సీనియర్ నాయకులు కె.చంటిబాబు, ఆకుల ప్రదీప్ కుమార్, సంతోశ్ కుమార్, శ్రీకాంత్, యాదగిరి, అనితలు సభ్యులుగా, ఆలయన పూజారి సర్వేశ్చారి ఎక్స్అఫిషియో మెంబర్‌గా ప్రమాణం చేశారు. అనంతరం కె. చంటిబాబును చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా కె.చంటిబాబు మాట్లాడుతూ.. అందరి సహాయ సహకారాలతో జూన్ 26వ తేదీ నుంచి నెల రోజులపాటు జరగనున్న ఆషాడమాసం బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సలహాదారు, సంఘ సేవకులు సిరుగుమల్లె రాజు వస్తాద్, కార్వాన్ నియోజకవర్గ సీనియర్ నాయకులు ఉస్మాన్ బిన్ అల్ హాజరి, కూరాకుల కృష్ణ, వేణు గౌడ్, కుల వృత్తిదారుల సంఘం సలహాదారు సాయిబాబా చారి, అధ్యక్షులు శివశంకర్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ చారి, మహంకాళి ఆలయ పూజారి సురేష్ చారి తదితరులు పాల్గొన్నారు.