IPL 2025 : ఐపీఎల్లో రికార్డ్ బ్రేకర్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ మెగాటోర్నీ చరిత్రలో అత్యధిక స్కోర్‌తో రికార్డులు నెలకొల్పిన ఆరెంజ్ ఆర్మీ.. 18వ ఎడిషన్‌లో భారీ లక్ష్యాన్ని కరిగించి అదరహో అనిపించింది. గురువారం కమిన్స్ సేన ముంబై ఇండియన్స్ సవాల్‌కు సిద్దమైంది. ఈ మ్యాచ్‌కు ముందు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమదైన రోజున ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసే సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆఖరి ఓవర్లలోనూ విధ్వంసాన్ని కొనసాగిస్తే 300 కొట్టడం ఖాయం అంటున్నాడు ఇషాన్ కిషన్.
శుభారంభం లభించాలేగానీ 287 పరుగుల రికార్డును బద్ధలు కొడుతాం.. ట్రిపుల్ సెంచరీతో గర్జిస్తాం అని చెబుతున్నాడీ యంగ్‌స్టర్. ‘మాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకూ విధ్వంసక బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉన్నారు. మాకు గనుక శుభారంభం లభిస్తే.. ఐపీఎల్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డులు సృష్టిస్తాం.
ఐపీఎల్లో 300 ప్లస్ కొట్టగల సత్తా మాకే ఉందని మాజీ క్రికెటర్లు సహ అభిమానులు నమ్ముతున్నారు.
అందరూ ఊహిస్తున్నట్టే 300 పరుగులు బాదేస్తాం. ఛేజింగ్‌లో మా దృష్టంతా లక్ష్యం మీదే ఉంటుంది. రన్‌రేటు తగ్గకుండా ఆడడం.. టార్గెట్‌ను చేరుకోవడం.. ఇవే మా బుర్రలో తిరుగుతాయి. అదే ఫస్ట్ బ్యాటింగ్ చేశామంటే.. మా లక్ష్యం బంతిని బాదడమే. పవర్ ప్లేలో దంచేశామంటే.. ఆ తర్వాత ఆ వికెట్ మీద ఇంకా ఎన్ని పరుగులు చేయగలమో ఒక అంచనాకు వస్తాం. పంజాబ్ కింగ్స్‌పై మాదిరిగా మా ఓపెనర్లు దూకుడుగా ఆడితే.. 300 కొట్టడం అనేది అసాధ్యం కాద’ని అన్నాడీ హిట్టర్. 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ 287 రన్స్ కొట్టి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
పద్దెనిమిదో సీజన్లో సన్‌రైజర్స్‌కు ఆడుతున్న ఇషాన్ తొలి మ్యాచ్‌లోనే వందతో మెరిశాడు. ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) బౌలర్లను ఉతికేస్తూ ఐపీఎల్లో మొదటి శతకంతో చెలరేగాడు. అయితే.. ఆ తర్వాత నిరాశపరిచిన ఇషాన్ ముంబైతో మ్యాచ్‌లో దంచికొట్టాలనే కసితో ఉన్నాడు. గతంలో ముంబై తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ యంగ్‌స్టర్‌కు వాంఖడేలో పరిస్థితులు బాగా తెలుసు.
𝙏𝙝𝙖𝙩 𝙢𝙖𝙞𝙙𝙚𝙣 #TATAIPL 𝙘𝙚𝙣𝙩𝙪𝙧𝙮 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🧡
A special first for Ishan Kishan as he brought up his 💯 off just 45 balls 🔥
Updates ▶️ https://t.co/ltVZAvInEG#SRHvRR | @SunRisers | @ishankishan51 pic.twitter.com/8n92H58XbK
— IndianPremierLeague (@IPL) March 23, 2025
ఇప్పుడు అదే అతడికి ప్లస్ కానుంది. ఈ ఎడిషన్‌లో హైదరాబాద్ జట్టు రెండు విజయాలతో 9వ స్థానంలో ఉండగా.. ముంబై 7వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. టాపార్డర్‌నే నమ్ముకున్న కమిన్స్ సేనను పేస్ బౌలింగ్‌ను ఆయుధంగా మలచుకున్న పాండ్యా బృందం ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.