IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ప్యాట్ కమిన్స్(Pat Cummins) కెప్టెన్‌గా తన ముద్ర వేశాడు. సారథిగా పగ్గాలు అందుకున్న తొలి సీజన్లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. దూకుడే మంత్రగా ఆరెంజ్ ఆర్మీని నడిపించిన కమిన్స్ ప్లే ఆఫ్స్ బెర్తు దక్కడంతో కాస్త చిల్ అవుతున్నాడు. అవును.. శుక్రవారం కమిన్స్ సరదాగా స్కూల్ పిల్లలతో క్రికెట్ ఆడాడు. పిల్లల బౌలింగ్‌లో షాట్లు కొడుతూ అలరించాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
గురువారం ఉప్పల్ స్టేడియంలో వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో హైదరాబాద్ నేరుగా ప్లే ఆఫ్స్ చేరింది. గత నాలుగేండ్లలో ఆరెంజ్ ఆర్మీ నాకౌట్ దశకు చేరడం ఇదే మొదటిసారి. పదిహేడో సీజన్ మినీ వేలంలో తనకు రికార్డు ధర(రూ.20.5 కోట్లు) పెట్టిన ఫ్రాంచైజీ నమ్మకాన్ని కమిన్స్ నిలబెట్టుకున్నాడు.
గత నాలుగేండ్లలో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, ఎడెన్ మర్క్రమ్(Aiden Markram) .. ఇలా కెప్టెన్లు మారినా హైదరాబాద్ జట్టు రాత మారలే. నిరుడు అయితే చెత్త ఆటతో అట్టడుగున నిలిచింది. దాంతో, కావ్య మారన్ టీమ్.. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా సక్సెస్ అయిన కమిన్స్‌ను రికార్డు ధరకు కొన్నది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అతడికి కెప్టెన్సీ అప్పగించింది.
We’re 𝗤𝗨𝗔𝗟𝗜-𝗙𝗜𝗥𝗘𝗗 up for the #IPL2024 playoffs! 🤩🔥#PlayWithFire pic.twitter.com/q5LScNRlCq
— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024
కమిన్స్ సారథ్యంలో ఆరెంజ్ ఆర్మీ రికార్డు బ్రేకర్ ట్యాగ్ సొంతం చేసుకుంది. 20 రోజుల వ్యవధిలోనే ఐపీఎల్ చరిత్రను తిరగరాస్తూ రెండుసార్లు అత్యధిక స్కోర్ బాదింది. ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌పై 277 రన్స్ కొట్టిన హైదరాబాద్.. ఆర్సీబీపై 287 రన్స్ కొట్టింది. 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరిన హైదరాబాద్ ప్రత్యర్థి ఎవరు? అనేది చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు మ్యాచ్‌తో తేలిపోనుంది.
Rain played spoilsport last night but you showed up as always, #OrangeArmy 🧡🫶 pic.twitter.com/Dg8ejxSgOT
— SunRisers Hyderabad (@SunRisers) May 17, 2024