Kylian Mbappe : బెర్లిన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం పేరు చెప్పగానే.. సైలబ్రిటీలు, క్రీడాకారుల మైనపు విగ్రహాలు కళ్ల ముందు మెదులుతాయి. వాటికి ప్రాణం ఒక్కటే ఉండదు అంతే. అంతలా పాపులర్ అయిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఓ యువ ఫుట్‌బాలర్ ఎంట్రీ ఇచ్చాడు. ఫ్రాన్స్ ఆటగాడు కిలియన్ ఎంబాబే (Kylian Mbappe) తాజాగా తన నిలువెత్తు మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు.
అనంతరం ఇది కలా? నిజమా? అని తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. అచ్చుగుద్దినట్టు తన రూపాన్ని పోలిన ఆ విగ్రహాన్ని చూసి ఎంబాపపే ఆశ్చర్యచకితుడయ్యాడు. ప్రపంచ పుట్‌బాల్‌లో ఎంబాపే లెజెండ్‌గా ఎదుగుతున్నాడు. లియోనల్ మెస్సీ(Lionel Messi), క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) తర్వాత గొప్ప ఫుట్‌బాలర్‌గా కీర్తి గడిస్తున్నాడు. ఈ యువకెరటం త్వరలోనే ప్యారిస్ సెయింట్ జర్మనీ క్లబ్(PSG)ను వీడనున్నాడు.
🇫🇷😲 Kylian Mbappe unveils his wax statue, which bears a striking resemblance to him.
🗣️ Kylian Mbappe: “He looks more like Kylian than me!” 😂🤝pic.twitter.com/uDtsDNfusr
— CentreGoals. (@centregoals) May 16, 2024
ఈ సీజన్లో ఇప్పటికే అతడు పీఎస్జీ తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అయితే.. తర్వాత ఎంబాపే ఏ క్లబ్‌కు వెళ్తాడు? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్‌కు ఆడుతాడా? లేదా సౌదీ అరేబియా క్లబ్‌తో ఒప్పందం చేసుకుంటాడా? అనేది తెలియాల్సి ఉంది.
రెండేండ్ల క్రితం ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup 2022)లో ఎంబాపే ఇరగదీశాడు. హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో అతడు అర్జెంటీనాకు ముచ్చెమటలు ప చాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో ఫ్రాన్స్‌ను దాదాపు గెలిపించినంత పనిచేశాడు. అయితే.. పెనాల్టీ షూటౌట్లో 4-2తో గెలుపొందిన మెస్సీ సేన మూడోసారి విజేతగా అవతరించింది. ఆ మోగా టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఎంబాపే గోల్డెన్ బూట్ అవార్డుతో సరిపెట్టుకున్నాడు.