World Cup 2027 : సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్‌ను చేజార్చుకున్న భారత్(Team India) కోట్లాదిమంది అభిమానులకు కన్నీళ్లు మిగిల్చింది. నవంబర్ 19 ఆదివారం జరిగిన టైటిల్ పోరులోఆస్ట్రేలియా(Australia) జోరు ముందు రోహిత్ సేన పోరాటం సరిపోలేదు. దాంతో, మూడోసారి వరల్డ్ కప్‌ను ముద్దాడాలనుకున్న టీమిండియా కల చెదిరింది. ఓవైపు భారమైన గుండెలతోనే భారత జట్టు 2027 ప్రపంచ కప్ (World Cup 2027) పోటీలకు తయారవుతోంది.
ఈసారి మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో పాటు నమీబియా ఆతిథ్యం ఇస్తున్నాయి. దక్షిణాఫ్రికా రెండోసారి ఆతిథ్యం ఇస్తుండగా నమీబియా తొలిసారి ప్రపంచ కప్‌కి వేదిక అవుతోంది. నవంబర్‌లో జరిగే ఈ టోర్నీలో 14 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. జట్ల అర్హత కోసం 2003లో ప్రవేశపెట్టిన విధానాన్నే అనుసరించనున్నారు.
A shiny new member in Australia’s dressing room 🏆#CWC23 pic.twitter.com/nDkBBku3HL
— ICC (@ICC) November 19, 2023
ప్రపంచ కప్ టోర్నీకి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచిన జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన ఆరు స్థానాల కోసం వరల్డ్ కప్ క్వాలిఫయర్ నిర్వహిస్తారు. మెగా టోర్నీకి క్వాలిఫై అయిన జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో 7 జట్లు ఉంటాయి. రెండు గ్రూపుల్లో టాప్ -3 టీమ్స్ సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. అంతేకాదు ఈసారి పాయింట్ క్యారీ ఫార్వర్డ్(PCF) సిస్టమ్‌ను తీసుకొస్తున్నారు. ఈ వ్యవస్థను తొలిసారి 1999 వరల్డ్ కప్‌లో ఉపయోగించారు.