TMRPS | బీఆర్ఎస్కే టీఎమ్మార్పీఎస్ మద్దతు : టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ
TMRPS | మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని టీఎంఆర్పీఎస్(TMRPS) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ(Vangapalli Srinivas Madiga) అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి దళితుల జీవితాల్లో వెలుగులు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. దళితుల జీవితాల్లో నూతన వెలుగులు నింపిన బీఆర్ఎస్ పార్టీ కే రానున్న ఎన్నికల్లో మా మద్దతు అన్నారు.
సూర్యాపేట : మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని టీఎంఆర్పీఎస్(TMRPS) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ(Vangapalli Srinivas Madiga) అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి దళితుల జీవితాల్లో వెలుగులు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. దళితుల జీవితాల్లో నూతన వెలుగులు నింపిన బీఆర్ఎస్ పార్టీ కే రానున్న ఎన్నికల్లో మా మద్దతు అన్నారు. సోమవారం సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసి ఎమ్మార్పిఎస్ నాయకులు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.
సూర్యాపేటతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్ రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లు 29 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా మాదిగలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు మాదిగలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకొంటూ అభివృద్ధిని, ఆర్థిక స్థితిగతులను మార్చే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింత బాబు మాదిగ, రాష్ట్ర నాయకులు పల్లేటి లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు ఏర్పుల సాయి మాదిగ, బచ్చలకూరి నాగరాజు, కడప పెంటయ్య, దుబ్బ రమేష్ , మేడి నరసింహ, మామిడి సైదయ్య,పెడమర్తి విజయ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

