Minister Jagadish Reddy | సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు..ఆహ్వానించిన మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadish Reddy | ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలోకి వలసల జాతర కొనసాగుతుంది. పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధికి మద్దతు తెలుపుతూ, స్వలాభం కోసం చేస్తున్న నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ , బీఎస్పీలను వీడి ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
సూర్యాపేట : ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలోకి వలసల జాతర కొనసాగుతుంది. పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధికి మద్దతు తెలుపుతూ, స్వలాభం కోసం చేస్తున్న నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ , బీఎస్పీలను వీడి ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా గాంధీనగర్ ఎస్సీ కాలనీకి చెందిన శ్రీకాంత్, రుత్విక్ యాకోబు, విజయ్ మధు అనిల్ తో పాటు పెద్ద సంఖ్యలో అంబేద్కర్ యూత్ సభ్యులు మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
మరోవైపు కాంగ్రెస్ నాయకులు అనంతల శ్రీనివాస్ గౌడ్ ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 31 వ వార్డు నుంచి కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు రాపర్తి నాగరాజుతో పాటు 83 మంది యూత్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధికి ఆకర్శితులై, తనకు మద్దతుగా పార్టీలో వారికి వచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేటను దేశంలోనే నెంబర్ వన్గ తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, జరుగుతున్న అభివృద్ధి యజ్ఞంలో పార్టీలకతీతంగా ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దిలీప్ రెడ్డి, రఫీ, జనార్దన్, అనంతల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

