Australia | ఒకే ఏడాది మూడు ఐసీసీ ట్రోఫీలు.. ఆస్ట్రేలియానా మజాకా?
Australia : ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా(Australia) అతీత శక్తిగా ఎదుగుతోంది. ఐసీసీ ఫైనల్స్(ICC Finals) చేరిందంటే చాలు కప్పుతో ఇంటికి వెళ్లడం ఆ జట్టుకు పరిపాటి అయింది. మెగా టోర్నీల్లో తమకు తిరుగులేదని కంగారు జట్టు మరోసారి నిరూపించింది. భారత గడ్డపై పాట్ కమిన్స్(Pat Cummins) నేతృత్వంలోని...
Australia : ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా(Australia) అతీత శక్తిగా ఎదుగుతోంది. ఐసీసీ ఫైనల్స్(ICC Finals) చేరిందంటే చాలు కప్పుతో ఇంటికి వెళ్లడం ఆ జట్టుకు పరిపాటి అయింది. మెగా టోర్నీల్లో తమకు తిరుగులేదని కంగారు జట్టు మరోసారి నిరూపించింది. భారత గడ్డపై పాట్ కమిన్స్(Pat Cummins) నేతృత్వంలోని ఆసీస్ వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాకు ఇది మూడో ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం.
జూన్‌లో ఇంగ్లండ్ గడ్డపై కమిన్స్ సారథ్యంలోని ఆసీస్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship 2023) ఫైనల్లో విజేతగా అవతరించింది. మేగ్ లానింగ్(Meg Lanning) కెప్టెన్సీలోని మహిళల జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. కమిన్స్ బృందం వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించడంతో ఆసీస్ ఖాతాలో మూడు ఐసీసీ ట్రోఫీలు చేరాయి.
టెస్టు గదతో కమిన్స్ బృందం

పురుషుల, మహిళల ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకూ 20 వరల్డ్ కప్ టైటిళ్లు గెలిచాయి. ఇదొక్కటి చాలు ఆసీస్ ఎంతటి ప్రమాదకరమైన జట్టో చెప్పడానికి. పెద్ద మ్యచులలో దూకుడే మంత్రగా ప్రత్యర్థులను మట్టికరిపించే ఆసీస్ వరల్డ్ కప్ ఫైనల్లోనూ అదే చేసింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కమిన్స్ సేన.. ఫేవరేట్ భారత జట్టుపై 6 వికెట్ల తేడాతో గెలుపొంది ఆరోసారి వరల్డ్ కప్ ట్రోఫీని దక్కించుకుంది.

ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ అనూహ్యంగా ఓటమి పాలైంది. టాస్ ఓడిన భారత్‌ను శుభ్‌మన్ గిల్(4) వికెట్ తీసి మిచెల్ స్టార్క్ దెబ్బకొట్టాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ(47)ను కమిన్స్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(66), విరాట్ కోహ్లీ(56) ఇన్నింగ్స్ నిర్మించడంతో భారత్ 240 పరుగులు చేసింది.
ట్రావిస్ హెడ్(137)

లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(137) శతకంతో చెలరేగాడు. డేవిడ్ వార్నర్(7), మిచెల్ మార్ష్(15), స్టీవ్ స్మిత్(4) ఔటైనా.. పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో నిలబడ్డ హెడ్ కేవలం 120 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 పరుగులు చేశాడు. మార్నస్ లబూషేన్(58)తో కలిసి నాలుగో వికెట్‌కు 192 పరుగులు జోడించి ఆసీస్‌ను గెలుపు వాకిట నిలిపాడు. దాంతో, సొంతగడ్డపై రెండోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడాలన్న భారత జట్టకు కల కలగానే మిగిలింది. ఆరో ట్రోఫీతో ఆసీస్ ఏ జట్టుకు అందనంత ఎత్తులో నిలిచింది.
ఇవి కూడా చదవండి
-
Travis Head | ‘ఆస్ట్రేలియా భవిష్యత్ స్టార్’ హెడ్.. వైరలవుతున్న షేన్ వార్న్ ట్వీట్
-
Aadikeshava Movie | ‘ఆదికేశవ’ ట్రైలర్ టైం ఫిక్స్.. ఎప్పుడంటే.?
-
Anand Mahindra | ఓటమిని కూడా అంగీకరించాల్సిందే.. టీమ్ఇండియా పరాజయంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

