Travis Head | ‘ఆస్ట్రేలియా భవిష్యత్ స్టార్’ హెడ్.. వైరలవుతున్న షేన్ వార్న్ ట్వీట్
Travis Head : ఐసీసీ ఫైనల్స్‌లో ఎదురన్నదే లేని ఆస్ట్రేలియా(Australia) రికార్డు స్థాయిలో ఆరోసారి చాంపియన్‌గా అవతరించింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీతో ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) మరోసారి హీరో అయ్యాడు. నాలుగు నెలల క్రితం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత్‌పై...
Travis Head : ఐసీసీ ఫైనల్స్‌లో ఎదురన్నదే లేని ఆస్ట్రేలియా(Australia) రికార్డు స్థాయిలో ఆరోసారి చాంపియన్‌గా అవతరించింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీతో ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) మరోసారి హీరో అయ్యాడు. నాలుగు నెలల క్రితం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత్‌పై శతకంతో గర్జించిన హెడ్.. వరల్డ్ కప్ ఫైనల్లోనూ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో, అతడిపై ఆస్ట్రేలియా మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సమయంలో ఆసీస్ దివంగత లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్(Shane Warne) ఏడేండ్ల కిందటి ట్వీట్ వైరల్ అవుతోంది. ‘ఒక క్రికెటర్‌గా నేను హెడ్‌కు వీరాభిమానిని. రాబోయే రోజుల్లో అతడు అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియాకు భవిష్యత్ స్టార్ అవుతాడు’ అని వార్న్ 2016 డిసెంబర్ 6న ట్వీట్ చేశాడు.
I’m a big fan of Travis Head as a cricketer, I believe he will be a future star for Australia in all forms of the game @wwos !!
— Shane Warne (@ShaneWarne) December 6, 2016
అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ ఆది నుంచి తడబడింది. టాస్ ఓడిన భారత్‌ను శుభ్‌మన్ గిల్(4) వికెట్ తీసి మిచెల్ స్టార్క్ దెబ్బకొట్టాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ(47)ను కమిన్స్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(66), విరాట్ కోహ్లీ(56) ఇన్నింగ్స్ నిర్మించడంతో భారత్ 240 పరుగులు చేసింది.
ట్రావిస్ హెడ్

లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(137) శతకంతో చెలరేగాడు. డేవిడ్ వార్నర్(7), మిచెల్ మార్ష్(15), స్టీవ్ స్మిత్(4) ఔటైనా.. పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో నిలబడ్డ హెడ్ కేవలం 120 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 పరుగులు చేశాడు. మార్నస్ లబూషేన్(58)తో కలిసి నాలుగో వికెట్‌కు 192 పరుగులు జోడించి ఆసీస్‌ను గెలుపు వాకిట నిలిపాడు. దాంతో, సొంతగడ్డపై రెండోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడాలన్న భారత జట్టకు కల కలగానే మిగిలింది. ఆరో ట్రోఫీతో ఆసీస్ ఏ జట్టుకు అందనంత ఎత్తులో నిలిచింది.
ఇవి కూడా చదవండి
-
Anand Mahindra | ఓటమిని కూడా అంగీకరించాల్సిందే.. టీమ్ఇండియా పరాజయంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
Actor Vijaykanth | ఆసుప్రతిలో చేరిన నటుడు విజయ్‌కాంత్..!
-
Mitchell Marsh | వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఆసీస్ ఆల్‌రౌండర్.. ఇది తగునా? అంటూ నెటిజన్ల విమర్శలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

