Mitchell Marsh | వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఆసీస్ ఆల్‌రౌండర్.. ఇది తగునా? అంటూ నెటిజన్ల విమర్శలు
Mitchell Marsh : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ(World Cup Trophy) పట్ల అవమానకరంగా ప్రవర్తించాడు. ట్రోఫీ బహూకరణ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో మార్ష్ సోఫాలో కూర్చొని ప్రపంచ కప్ ట్రోఫీపై...
Mitchell Marsh : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ(World Cup Trophy) పట్ల అవమానకరంగా ప్రవర్తించాడు. ట్రోఫీ బహూకరణ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో మార్ష్ సోఫాలో కూర్చొని ప్రపంచ కప్ ట్రోఫీపై కాళ్లు ఆనించాడు. దాంతో, అతడిపై సోషల్‌మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘మార్ష్ నీకిది తగునా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘దయచేసి ట్రోఫీకి కాసింత మర్యాద ఇవ్వండి’, ‘ఏరకంగా చూసినా ఇది తప్పే’ అని పలువురు కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో ‘ఆస్ట్రేలియన్లకు ఇది ఏమంత సిగ్గు చేటు కాదు’ అని అంటున్నారు.
Mitchell Marsh with the World Cup. pic.twitter.com/n2oViCDgna
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023
అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ తడబడింది. టాస్ ఓడిన భారత్‌ను శుభ్‌మన్ గిల్(4) వికెట్ తీసి మిచెల్ స్టార్క్ దెబ్బకొట్టాడు. కేఎల్ రాహుల్(66), విరాట్ కోహ్లీ(56), రోహిత్ శర్మ(47) రాణించడంతో భారత్ 240 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(137) శతకంతో చెలరేగాడు. బుమ్రా, షమీ, సిరాజ్ బౌలింగ్‌లో భారీ బౌండరీలో బాదిన హెడ్ భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.

డేవిడ్ వార్నర్(7), మిచెల్ మార్ష్(15), స్టీవ్ స్మిత్(4) ఔటైనా.. పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో నిలబడ్డ హెడ్ కేవలం 120 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 పరుగులు చేయడం విశేషం. మార్నస్ లబూషేన్(58)తో కలిసి నాలుగో వికెట్‌కు 192 పరుగులు జోడించి ఆసీస్‌ను గెలుపు వాకిట నిలిపాడు. దాంతో, సొంతగడ్డపై రెండోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడాలన్న భారత జట్టకు కల కలగానే మిగిలింది.
ఇవి కూడా చదవండి
-
Virat Kohli | చేజారిన ప్రపంచ కప్.. కోహ్లీని ఓదార్చిన అనుష్క.. పిక్స్ వైరల్
-
Travis Head | అప్పుడూ.. ఇప్పుడూ టీమిండియా విలన్ అతడే
-
Stock Markets | నష్టాలతో మొదలై.. లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

