Virat Kohli | చేజారిన ప్రపంచ కప్.. కోహ్లీని ఓదార్చిన అనుష్క.. పిక్స్ వైరల్
Virat Kohli | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ (World Cup Final) భారతీయులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. కప్ చేజారడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సహా పలువురు ఆటగాళ్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలో జట్టు ఓటమితో తీవ్ర ఆవేదనకు గురైన విరాట్ కోహ్లీ (Virat Kohli)ని.. అక్కడే ఉన్న భార్య అనుష్క శర్మ (Anushka Sharma) అండగా నిలిచింది.
Virat Kohli | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ (World Cup Final) భారతీయులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఆది నుంచి వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న రోహిత్ సేన.. చివరి మ్యాచ్‌లో తడబాటుకు గురైంది. ఫలితంగా ఆస్ట్రేలియా (Australia) చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని కప్పును చేజార్చుకుంది. ఈ ఓటమితో భారత క్రీడాలోకం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. మరోవైపు కప్ చేజారడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సహా పలువురు ఆటగాళ్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ క్రమంలో జట్టు ఓటమితో తీవ్ర ఆవేదనకు గురైన విరాట్ కోహ్లీ (Virat Kohli)ని.. అక్కడే ఉన్న భార్య అనుష్క శర్మ (Anushka Sharma) అండగా నిలిచింది. భర్తను కౌగిలించుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు అనుష్కపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టసమయంలో అనుష్క తన భాగస్వామికి వెన్నంటే నిలుస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో వీరు ఆదర్శదంపతులు అంటూ చెప్పుకుంటున్నారు.
Virat Kohli hugged Anushka Sharma after the World Cup final lose.
– He is Heartbroken…!!!!!! 💔 pic.twitter.com/m7t79l0QOX
— CricketMAN2 (@ImTanujSingh) November 19, 2023
వరల్డ్ కప్ లీగ్ దశలో టీమిండియా తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచింది. కీలకమైన సెమీస్‌లోనూ 2019 రన్నరప్ న్యూజిలాండ్‌ను 70 పరుగులతో చిత్తు చేయడంతో ఈసారి ట్రోఫీ మనదే అనుకున్నారంతా. అయితే.. దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్ చేరడంతో ట్రోఫీ దక్కేనా? అని మనసులో సందేహం. అనుకున్నట్టుగానే కంగారూల చేతిలో రోహిత్ సేన ఓటమిపాలైంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ తడబడింది. ఆసీస్ పేసర్ల విజృంభణతో 240 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో ఆదిలోనే మూడు కీలక వికెట్లు తీసినప్పటికీ ట్రావిస్ హెడ్(137), మార్నస్ లబూషేన్(58 నాటౌట్) గోడలా నిలబడ్డారు. దాంతో, 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆసీస్ ఆరోసారి ప్రపంచ కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
Also Read..
Mohammad Siraj | వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సిరాజ్
Novak Djokovic | ఏటీపీ ఫైనల్స్‌లో జకోవిచ్ సంచలనం.. ఏడో టైటిల్‌తో సరికొత్త రికార్డు
Earthquake | మహారాష్ట్రలో స్వల్ప భూకంపం.. భయాందోళనలో ప్రజలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

