Novak Djokovic | ఏటీపీ ఫైనల్స్‌లో జకోవిచ్ సంచలనం.. ఏడో టైటిల్‌తో సరికొత్త రికార్డు
Novak Djokovic : టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ఏటీపీ ఫైనల్స్‌లో సంచలనం సృష్టించాడు. రికార్డు స్థాయిలో ఏడో టైటిల్ సాధించాడు. ఇటలీలోని ట్యూరిన్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో జకో.. స్థానిక ఆటగాడు జన్నక్ సిన్నర్(Jannak Sinner)ను...
Novak Djokovic : టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ఏటీపీ ఫైనల్స్‌లో సంచలనం సృష్టించాడు. రికార్డు స్థాయిలో ఏడో టైటిల్ సాధించాడు. ఇటలీలోని ట్యూరిన్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో జకో.. స్థానిక ఆటగాడు జన్నక్ సిన్నర్(Jannak Sinner)ను మట్టికరిపించాడు.
గంట 43 నిమిషాల పాటు జరిగిన టైటిల్ పోరులో వరుస సెట్లలో ఆధిపత్యం చెలాయించి జకోవిచ్ 6-3, 6-3తో గెలుపొందాడు. ‘ఇది నా జీవితంలో అత్యుత్తమ సీజన్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈవారం అద్భుతమైన టెన్నిస్ ఆడిన స్థానిక హీరో జన్నిక్పై గెలుపొంది.. టైటిల్ సాధించడం మర్చిపోలేని అనుభూతి’ అని మ్యాచ్ అనంతరం జకోవిచ్ తెలిపాడు.

ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్(Australia Open 2023)తో మొదలు జకోవిచ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన జకో.. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో రఫెల్ నాదల్(Rafael Nadal) రికార్డు బ్రేక్ చేశాడు. పురుషుల టెన్నిస్‌లో అత్యధికంగా 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వింబుల్డన్ ట్రోఫీ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ చేతిలో కంగుతిన్న జకో.. సిన్సినాటి ఓపెన్‌లో చాంపియన్‌గా అవతరించాడు. అదే ఊపులో జకోవిచ్ ఏటీపీ ఫైనల్స్ టైటిల్ ఛేజిక్కించుకున్నాడు.
ఇవి కూడా చదవండి
-
Mohammad Siraj | వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సిరాజ్
-
Fire Accident | విశాఖపట్నం ఫిష్ హార్బర్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 40 పడవలు..!
-
CM KCR | నేడు స్టేషన్ ఘన్పూర్, మానకొండూరు, నకిరేకల్, నల్లగొండలో ప్రజా ఆశీర్వాద సభలు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

