CM KCR | నేడు స్టేషన్ ఘన్పూర్, మానకొండూరు, నకిరేకల్, నల్లగొండలో ప్రజా ఆశీర్వాద సభలు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్
జనగామ, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, మానకొండూరు, నకిరేకల్, నల్లగొండ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తుండటంతో రాజకీయపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అగ్ర నాయకులు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ (BRS).. మ్యానిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రతిరోజూ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ గులాబీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం జనగామ, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, మానకొండూరు, నకిరేకల్, నల్లగొండ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్ సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. హైదరాబాద్-వరంగల్ హైవేపై మీదికొండ క్రాస్‌రోడ్డులోని శివారెడ్డిపల్లి శివారులో ఏర్పాటుచేసిన ప్రజాఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం మానకొండూరు బయల్దేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో నిర్వహించే సభలో మాట్లాడుతారు.
మధ్యాహ్నం 3 గంటలకు స్టేషన్ ఘన్పూర్ నుంచి నకిరేకల్‌కు చేరుకుంటారు. నకిరేకల్‌లోని మూసీ రోడ్డులో ఏఎమ్మార్పీ కాల్వ పక్కనే విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. పార్టీ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య తరఫున ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్ర 4 గంటలకు నల్లగొండకు బయల్దేరుతారు. పట్టణంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు హాజరవుతారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం పూర్తికానున్నది. మంగళవారం సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

