Fire Accident | విశాఖపట్నం ఫిష్ హార్బర్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 40 పడవలు..!
Fire Accident | ఏపీ విశాఖపట్నం ఫిష్ హార్బర్లో ఆదివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 40 పడవలు కాలిబూడిదయ్యాయి. ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Fire Accident | ఏపీ విశాఖపట్నం ఫిష్ హార్బర్లో ఆదివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 40 పడవలు కాలిబూడిదయ్యాయి. ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి. ఆ తర్వాత సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని పేర్కొన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అయితే, ప్రమాదంలో సుమారు రూ.30కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు అంచనా అంచనా వేస్తున్నారు. దాదాపు 40 వరకు బోట్లు కాలిపోవడంతో మత్స్యకారులు కన్నీరుమన్నీరవుతున్నారు. అయితే, సముద్ర గాలులకు మంటలు భారీగా చెలరేగడంతో ఒకదానికి ఒకటి అంటుకున్నాయి. పలువురు బోట్లను సముద్రంలోకి తీసుకెళ్లడంతో కొంత నష్టం తగ్గిందని పలువురు మత్స్యకారులు పేర్కొన్నారు.
#WATCH | Andhra Pradesh: A massive fire broke out in Visakhapatnam fishing harbour. The fire that started with the first boat eventually spread to 40 boats. Several fire tenders reached the spot to control the fire. Police have registered a case and are investigating the matter.… pic.twitter.com/1ZYgiWInOz
— ANI (@ANI) November 20, 2023
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

