Stock Markets | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే, ఉదయం ఉదయం నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 93 పాయింట్ల కోల్పోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 18.63 పాయింట్లు పెరిగి 65,813.36 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 16.95 పాయింట్లు పెరిగి 19,748.10 పాయింట్ల వద్ద కొనసాగుతున్నది.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.24 దగ్గర ప్రారంభమైంది. బ్యాంకింగ్ రంగ షేర్లు మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్ 1.25 శాతం పతనంతో టాప్ లూజర్‌గా ట్రేడవుతోంది. కాగా, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచియాయి. నిఫ్టీలో దివిస్ ల్యాబ్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.