హిమాచల్‌లో ‘వితంతు’ ట్యాక్స్!
‘ఎన్ని హామీలైనా ఇవ్వాలి.. ఎన్నికల్లో మాత్రం గెలవాలి’ అనే కాంగ్రెస్ తీరు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలను దివాలా తీయిస్తున్నది. గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చే ముందు ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోని కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక నెరవేర్చే దారి లేక ఒకవైపు సబ్సిడీలకు కోత పెడుతూ.. మరోవైపు వింత పేర్లతో పన్నులవాతకు తెగబడుతున్నది.
- ఆదాయం కోసం కాంగ్రెస్ సర్కారు వింత చేష్టలు
- వితంతువు, అనాథల పేర పెట్రోల్, డీజిల్‌పై బాదుడు
- తొలుత 60 పైసలు వర్తింపు.. ఆ తర్వాత రూ. 5 వాత!
- ఇప్పటికే లక్ష కోట్లు దాటిన అప్పు.. ప్రభుత్వంపై విమర్శలు
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ‘ఎన్ని హామీలైనా ఇవ్వాలి.. ఎన్నికల్లో మాత్రం గెలవాలి’ అనే కాంగ్రెస్ తీరు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలను దివాలా తీయిస్తున్నది. గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చే ముందు ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోని కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక నెరవేర్చే దారి లేక ఒకవైపు సబ్సిడీలకు కోత పెడుతూ.. మరోవైపు వింత పేర్లతో పన్నులవాతకు తెగబడుతున్నది.
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కార్ తీరు ఇందుకు తాజా ఉదాహరణ. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి విడో (వితంతువు), ఆర్ఫన్ (అనాథ)ల పేరిట ఓ సెస్‌ను సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై తొలుత 60 పైసల చొప్పున పన్ను విధిస్తున్నట్టు ప్రకటించింది. బుధవారం నుంచి పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే, విడో సెస్ పేరిట రానున్న కాలంలో పెట్రోల్‌పై రూ. 5 వరకూ వడ్డింపు ఉండొచ్చని సంబంధితవర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం చట్టసవరణ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అప్పుడు అసలుకే మోసం
పెట్రోల్, డీజిల్‌పై విడో, ఆర్ఫన్ ట్యాక్స్‌ను విధిస్తూ సుఖు సర్కార్ తీసుకొన్న నిర్ణయంపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ మండిపడింది. సర్కార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటే, వాహనాదారులు పొరుగు రాష్ర్టాల పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని నింపుకొనే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. అప్పుడు రాష్ట్ర ఆదాయానికి పూర్తిగా గండి పడొచ్చని గుర్తుచేశారు. వితంతువు, అనాథల పేరిట వసూలు చేస్తున్న ఈ పన్నులను ప్రభుత్వం ఆయా వర్గాలకు ఎంతమాత్రం ఖర్చుచేయబోదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. రాష్ర్టాన్ని అప్పులపాలు చేసిన కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని నడపడానికి ఇలా సామాన్యులపై వసూళ్ల పర్వానికి తెగబడుతున్నదని మండిపడ్డారు. కాగా 2024లో టాయ్‌లెట్ ట్యాక్స్‌ను తీసుకొచ్చి ఇదే సుఖు సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే.
కష్టాలు మొదలయ్యాయి ఇలా..
రాష్ట్ర అసెంబ్లీకి 2022 చివర్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 గ్యారెంటీలు ప్రకటించింది. 18 ఏండ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పాత పింఛన్ విధానం అమలు వంటి అనేక హామీలు గుప్పించింది. అయితే, హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఈ హామీలను అమలు చేసే స్థితిలో లేదు. ఇదేమీ పట్టించుకోకుండా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన సుఖు సర్కార్ రాష్ర్టాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి దిగజారి.. ఇప్పుడు హామీలకు, సబ్సిడీలకు కత్తెర పెడుతూ సెస్‌ల పేరిట వాతకు దిగింది. అంతేకాదు, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించారు. గత ఏడాది రూ. 58,514 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడితే, ఈసారి రూ. 3,586 కోట్లు తగ్గిస్తూ రూ.54,928 కోట్లకు బడ్జెట్‌ను పరిమితం చేశారు.
ఒక్కొక్కరిపై రూ.1.37 లక్షల అప్పు
దేశంలో తలసరి అప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ ముందువరుసలో ఉన్నది. ఈ చిన్న రాష్ర్టం అప్పు ఇప్పుడు రూ.1,04,000 కోట్లకు చేరింది. హిమాచల్ జనాభా 76 లక్షలు. ఈలెక్కన రాష్ర్టంలో ఒక్కొక్కరిపై రూ.1.37 లక్షల అప్పు భారం ఉన్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

