Actor Vijaykanth | ఆసుప్రతిలో చేరిన నటుడు విజయ్‌కాంత్..!
Acotr Vijaykanth | ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే నేత విజయ్‌కాంత్ ఆసుపత్రిలో చేరారు. గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా శనివారం ఆయన చెన్నై పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
Actor Vijaykanth | ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే నేత విజయ్‌కాంత్ ఆసుపత్రిలో చేరారు. గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా శనివారం ఆయన చెన్నై పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. రెగ్యులర్ ఆరోగ్య పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రిలో చేరారని.. త్వరలోనే ఇంటికి చేరుకుంటారని డీఎండీకే ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, గతకొంతకాలంగా విజయ్‌కాంత్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం.
ఈ కారణంగానే ఆయన కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయలేదు. విజయ్‌కాంత్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో ఆయన భార్య ప్రేమలత ముందుండి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై పార్టీ చర్చలు జరుపుతున్నది. ఈ సమయంలోనే విజయ్‌కాంత్ ఆసుపత్రిలో చేరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

