SA vs IND 1st T20 : సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత తొలి సిరీస్‌లో విజయంపై టీమిండియా కన్నేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్.. తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే.. ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేయాలనుకున్న రమన్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్, యశ్ దయాల్‌కు నిరీక్షణ తప్పలేదు.
తొలి మ్యాచ్‌లో విజయం తర్వాత ప్రయోగాలు చేయొచ్చులే అనుకున్న మేనేజ్మెంట్ వీళ్లను పక్కన పెట్టేసింది. గత పర్యటనలో సిరీస్ సమం చేసిన టీమిండియా ఈసారి సఫారీలకు ఆ చాన్స్ ఇవ్వొద్దనే కసితో ఉంది. దాంతో, ఇరుజట్ల మధ్య హోరాహోరీ తప్పదనిపిస్తోంది.
భారత జట్టు : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్నోయ్, అవేశ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా జట్టు : రీజా హెన్రిక్స్, రియాన్ రికెల్టన్, ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్టీ, నబా పీటర్, ఒట్నిల్ బార్ట్‌మన్.