లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final) ఇవాళ టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బౌలింగ్ ఎంచుకున్నది. ఆస్ట్రేలియా తరపున ఓపెనర్‌గా లబుషేన్ ఆడనున్నాడు. సఫారీ జట్టులోకి లుంగి ఎంగిడి వచ్చాడు. వరల్డ్ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా టాప్‌లో ఉన్నది. దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో ఉంది. ఆసీస్ బ్యాటర్ లబుషేన్ టెస్టుల్లో తొలిసారి ఓపెనింగ్ చేయనున్నాడు. కెమరూన్ గ్రీన్ మూడవ స్థానంలో బ్యాటింగ్ రానున్నాడు. ఆసీస్ జట్టులోకి హేజిల్‌వుడ్‌ను తీసుకున్నారు. స్కాట్ బోలాండ్కు అవకాశం దక్కలేదు.
Follow our live blog from Lord’s as South Africa win the toss and elect to bowl in cloudy conditions at the #WTC25 Final 🙌https://t.co/LgFXTd0jRV
— ICC (@ICC) June 11, 2025
Also Read..