Pink Jerseys | పింక్ జెర్సీలతో నిండిపోయిన స్టేడియం.. కారణం ఏంటంటే..?
Pink Jerseys : భారత్, దక్షిణాఫ్రికా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జొయన్నెస్బర్గ్(Johannesberg)లో తొలి వన్డేలో తలపడుతున్నాయి. న్యూ వాండెరర్స్ స్టేడియం(New Wanderers Stadium)లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు ఆకుపచ్చ రంగు జెర్సీలతో కాకుండా 'పింక్ జెర్సీ'(Pink Jersey)తో...
Pink Jerseys : భారత్, దక్షిణాఫ్రికా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జొయన్నెస్బర్గ్(Johannesberg)లో తొలి వన్డేలో తలపడుతున్నాయి. న్యూ వాండెరర్స్ స్టేడియం(New Wanderers Stadium)లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు ఆకుపచ్చ రంగు జెర్సీలతో కాకుండా ‘పింక్ జెర్సీ'(Pink Jersey)తో బరిలోకి దిగింది.
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మాత్రమే కాదు సహాయక సిబ్బంది, మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు కూడా గులాబీ రంగు జెర్సీలు వేసుకొన్నారు. దాంతో, స్టేడియమంతా గులాబీమయం అయింది. సఫారీ ప్లేయర్లతో పాటు వీళ్లంతా పింక్ జెర్సీ వేసుకోవడానికి ఓ కారణం ఉంది.
పింక్ జెర్సీ వేసుకున్న మిల్లర్, డివిలియర్స్, రబాడ

అదేంటంటే..? ‘పింక్ డే'(Pink Day) సందర్భంగా అందరూ గులాబీ రంగు జెర్సీలు ధరించారు. రొమ్ము క్యాన్సర్(Breast Cancer) మీద అవగాహన పెంచడం కోసం వీళ్లంతా గులాబీ జెర్సీలు వేసుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టు పింక్ జెర్సీలో ఆడడం ఇది రెండోసారి. 2013లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డేలో ఆ జట్టు ఆటగాళ్లు తొలిసారి పింక్ జెర్సీ వేసుఉన్నారు.
56-6 after 12 overs: Not pretty after electing to bat
👉https://t.co/KlF2UsA3nF | #SAvIND pic.twitter.com/4OkGUXaPKG
— ESPNcricinfo (@ESPNcricinfo) December 17, 2023
న్యూ వాండెరర్స్ స్టేడియంలో భారత యువ పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. మొదట అర్ష్‌దీప్ సింగ్ సఫారీ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. అనంతరం అవేశ్ ఖాన్ వేట మొదలెట్టాడు. దాంతో, సఫారీ జట్టు 6 వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న దక్షిణాఫ్రికాను బౌన్స్‌తో అర్ష్‌దీప్ బెంబేలెత్తించాడు. వరుస బంతుల్లో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(0) టోని డె జొర్జి(28) పెవిలియన్ పంపాడు.
Arshdeep’s double strike 🔥 @StarSportsIndia
Tune in to the 1st #SAvIND ODI LIVE NOW | Star Sports Network #Cricket pic.twitter.com/ou3QNXIVW7
— ESPNcricinfo (@ESPNcricinfo) December 17, 2023
ఆ తర్వాతి ఓవర్లో డేంజరస్ వాన్ డస్సెన్(0), ప్రమాదకరమైన హెన్రిచ్ క్లాసెన్(6)లను బౌల్డ్ చేశాడు. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(12)ను అవేశ్ ఖాన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంతికే వియాన్ మల్డర్(0)ను ఎల్బీగా ఔటయ్యాడు. అనంతరం డేంజరస్ మిల్లర్(2)ను అవేశ్ ఔట్ చేశాడు. దాంతో, 58 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.
ఇవి కూడా చదవండి
- MLA Sanjay Kumar | పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
- Adulterated Milk | మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఈ టెక్నిక్ ద్వారా ఈజీగా కనిపెట్టేయొచ్చు!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

