MLA Sanjay Kumar | పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
MLA Sanjay Kumar | దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ రాష్ట్రంలో అధిక మొత్తంలో పెన్షన్స్ ఇచ్చామని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు. జగిత్యాలలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పెన్షనర్స్ డే(National Pensioners Day) కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
జగిత్యాల : దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ రాష్ట్రంలో అధిక మొత్తంలో పెన్షన్స్ ఇచ్చామని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు. జగిత్యాలలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పెన్షనర్స్ డే(National Pensioners Day) కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పెన్షనర్స్ భవనంలో ఆడిటోరియం నిర్మాణానికి 5 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవ మొత్తంలో అధిక జీతాలు చెల్లించామని గుర్తు చేశారు. జగిత్యాల ప్రభుత్వ దవాఖానలో క్యాన్సర్ రోగుల కోసం పాలియేటివ్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజీ కేటాయించడం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తున్నది. నేడు జిల్లా మెడికల్ హబ్‌గా తయారయిందని పేర్కొన్నారు.
ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు సత్వర హామీ ల అమలుకు కృషి చేయాలన్నారు. డీఏ, ఏరియల్స్, పీఆర్ఎస్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పెన్షనర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటామ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గంగ రాజం, ప్రధాన కార్యదర్శి రవీందర్, కౌన్సిలర్లు ముస్కు నారాయణ రెడ్డి, కౌన్సిలర్ పాంబాల రామ్ కుమార్, నాయకులు గిరి, అనిల్, నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

