IPL DC vs MI : ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ధాటిగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ బ్యాటర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఔటయ్యాడు. 8వ ఓవర్ మూడో బంతికి చావ్లా బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి మెక్‌గుర్క్ స్కోర్ 27 బంతుల్లో 84 పరుగులు. అందులో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.
ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఔటయ్యేటప్పటికి ఢిల్లీ మరో ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ పొరెల్ 19 బంతుల్లో 27 పరుగులతో ఉన్నాడు. అప్పటికి జట్టు స్కోర్ ఒక వికెట్ నష్టానికి 114 పరుగులు. మెక్‌గుర్క్ ఔట్ అనంతరం అభిషేక్ పొరెల్‌కు షాయ్ హోప్ జత కలిశాడు.