Padi Kaushik Reddy | రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర..! ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Padi Kaushik Reddy | రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుట్ర చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్ద 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తనకు మద్దతిచ్చే విషయమై బీఆర్ఎస్ అధిష్టానంతో మాట్లాడాలని కోమటిరెడ్డి తన వద్దకు రాయబారం పంపారని కౌశిక్ రెడ్డి తెలిపారు.
Padi Kaushik Reddy | కరీంనగర్ : రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుట్ర చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్ద 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తనకు మద్దతిచ్చే విషయమై బీఆర్ఎస్ అధిష్టానంతో మాట్లాడాలని కోమటిరెడ్డి తన వద్దకు రాయబారం పంపారని కౌశిక్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడారు.
కోమటిరెడ్డి ఒక మనిషిని నా దగ్గరికి పంపించిండు. 22 మంది ఎమ్మెల్యేలల మద్దతు ఉంది. గవర్నమెంట్ పడగొడుదాం.. నేనే ముఖ్యమంత్రి అయితా అని, అందుకు బీఆర్ఎస్ మద్దతు కావాలని నా వద్దకు పంపించిండు. కానీ నేను కోమటిరెడ్డిని నమ్మలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు కూడా చెప్పలేదు. కోమటిరెడ్డి పిచ్చొడు.. నమ్మకం లేదని. రూమ్ లోపల ఒకటి, రూమ్ బయట ఒకటి మాట్లాడుతాడు. మిమ్మల్ని ప్రశ్నించమని ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కోమటిరెడ్డిని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు. అసెంబ్లీకి మందుతాగి వస్తడు. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెల్వదు. హరీశ్‌రావును విమర్శించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. నోటికొచ్చినట్టు మాట్లాడితే సరికాదు.. మీరు ఒక్క మాట అంటే మేం వంద మాటలు అంటాం. అధికారంలో ఉన్నారు కాబట్టి బాధ్యతగా మాట్లాడాలి. మీకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు. ఇక్కడ ఉన్నది కేసీఆర్ సైనికులం తస్మాత్ జాగ్రత్త.. మీ తాట తీస్తాం. మిమ్మల్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు అని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

