Adulterated Milk | మీరు తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఈ టెక్నిక్ ద్వారా ఈజీగా కనిపెట్టేయొచ్చు!
Adulterated Milk | ఈ రోజుల్లో కల్తీ పెరిగిపోయింది. ఈ మహమ్మారి కారణంగా ఏది కొనాలన్నా.. ఏది తినాలన్నా భయమేస్తోంది. సొమ్ములకు ఆశపడి కొందరైతే ఏకంగా అందరూ తాగే పాలను కూడా కల్తీ చేసేస్తున్నారు. యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి వాటితో కల్తీ పాలు తయారు చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు.
Adulterated Milk | ఈ రోజుల్లో కల్తీ పెరిగిపోయింది. ఈ మహమ్మారి కారణంగా ఏది కొనాలన్నా.. ఏది తినాలన్నా భయమేస్తోంది. సొమ్ములకు ఆశపడి కొందరైతే ఏకంగా అందరూ తాగే పాలను కూడా కల్తీ చేసేస్తున్నారు. యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి వాటితో కల్తీ పాలు తయారు చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. దీంతో చాలామంది పాలు తాగాలంటే కూడా భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే మనం తాగే పాలు స్వచ్ఛమైనవేనా? కావా? వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలను వేడి చేయడం ద్వారా అవి కల్తీ పాలా.. స్వచ్ఛమైన పాలా అనేది తెలుసుకోవచ్చని బెంగళూరు ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలను వేడి చేసినప్పుడు అవి ఆవిరయ్యే తీరు ఆధారంగా వాటిలో ఎంతవరకు నీళ్లు లేదా యూరియా కలిసిందో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అదెలా అంటే.. స్వచ్ఛమైన పాలను వేడి చేసినప్పుడు పాల మధ్యలో బుడగలా వస్తుంది. అక్కడే మరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అదే కల్తీ పాలను వేడి చేసినప్పుడు ఈ ప్రక్రియ స్థిరంగా ఉండదు. పాత్ర అంచుల వరకు పాలు మరుగుతాయి. పాలల్లో నీళ్లు ఎంత కలిపారన్నదాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. యూరియాతో కల్తీ అయ్యి ఉంటే ఆ పాలు ఆవిరి కావు. పాత్ర అంచుకు చుక్కల్లా అంటుకుంటుంది. పాలల్లో 30 శాతం కంటే ఎక్కువ నీరు కలిపినా.. 0.4 శాతం యూరియా కలిసినా ఈ విధానం ద్వారా గుర్తించవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

