Ramayan | సీతాదేవిగా సాయి పల్లవి.. లుక్ అదిరిందిగా.. ఫొటోలు వైరల్
Ramayan | పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమా అయిన 'రామాయణ్' షూటింగ్ షురువైంది. ఎలాంటి హంగామా, హడావిడి లేకుండా షూటింగ్ మొదలు పెట్టేశారు. సాయిపల్లవి సీతాదేవిగా, రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి గెటప్‌లో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సీతాదేవిగా సాయిపల్లవి లుక్ అదిరింది.
Ramayan : పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమా అయిన ‘రామాయణ్’ షూటింగ్ షురువైంది. ఎలాంటి హంగామా, హడావిడి లేకుండా షూటింగ్ మొదలు పెట్టేశారు. సాయిపల్లవి సీతాదేవిగా, రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి గెటప్‌లో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సీతాదేవిగా సాయిపల్లవి లుక్ అదిరింది.
ఆ ఫొటోలను చూసి నెటిజన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సాయిపల్లవి అందానికి ఫిదా అవుతున్నారు. ప్రతిష్టాత్మక రామాయణం ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఆ అన్ని సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. అయితే పోయిన ఏడాది విడుదలైన ‘ఆదిపురుష్’ మాత్రం విపరీతంగా ట్రోలింగ్కి గురైంది.
ఇప్పుడు బాలీవుడ్లో రామాయాణాన్ని సినిమాగా తీస్తున్నారు. బాలీవుడ్లో రామాయణం సినిమా తీస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఎవరూ నిర్ధారించలేదు. శ్రీరామ నవమికి ప్రకటన వస్తుందేమోనని అంతా భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్లో రామాయణం సినిమా వస్తుందనే వార్తలు ఉత్తవే అనుకున్నారు.
కానీ ఇప్పుడు రామాయణం సినిమా సెట్స్ నుంచి రాముడు, సీత పాత్రలకు సంబంధించిన కొన్ని ఫొటోలు లీకయ్యాయి. సోషల్ మీడియాలో ఇవి ఫుల్‌గా సర్క్యులేట్ అవుతున్నాయి. లుక్స్ బాగున్నాయి. అయితే ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఇందులో రావణుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ కనిపించనున్నారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

