Food Inflation | ధరలు ఎప్పుడు తగ్గుతాయో చెప్పిన ఆర్థిక మంత్రిత్వ శాఖ..!
Food Inflation | రుతుపవనాల సీజన్ తర్వాతే ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొన్నది. భారత వాతావరణశాఖ ఈ సారి సాధారణం కంటే ఎక్కువగా వర్షాపాతం ఉంటుందని అంచనా వేసిన విషయం తెలిసిందే.
Food Inflation | రుతుపవనాల సీజన్ తర్వాతే ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ
అంచనా వేసింది. నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొన్నది. భారత వాతావరణశాఖ ఈ సారి సాధారణం కంటే ఎక్కువగా వర్షాపాతం ఉంటుందని అంచనా వేసిన విషయం తెలిసిందే. వర్షాపాతం ఎక్కువ నమోదైతే పంటల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది. వర్షాలతో దిగుబడులు అధికంగా వచ్చే అవకాశాలుంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీగా సమీక్షలో పేర్కొంది. భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 8.7శాతం ఉండగా.. మార్చి నాటికి 8.5 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూరగాయలు, పప్పుల ధరలు పెరగడం ప్రధాన కారణం.
అయితే, ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింగి. హోర్డింగ్స్‌ను నిరోధించడంతో పాటు స్టాక్ పరిమితులను నిర్ణయించడం, బఫర్ స్టాక్‌ను బలోపేతం చేస్తూ.. మార్కెట్‌కు విడుదల చేస్తూ వచ్చింది. అదే సమయంలో ఇతర దేశాలను నుంచి దిగుమతులను సైతం సులభతరం చేసింది. ధరలను కట్టి చేసేందుకు రిటైల్ అవుట్‌లెట్స్ ద్వారా క్రమబద్ధీకరించింది. పప్పు దినుసులను దిగుమతి చేసుకునేందుకు దీర్ఘకాలిక
ఒప్పందాల కోసం బ్రెజిల్, అర్జెంటీనా ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రెజిల్ నుంచి 20వేల టన్నులు పెసరపప్పు దిగుమతి కానున్నది. అర్జెంటీనా నుంచి కందుల దిగుమతి చర్చలు జరుపుతున్నది. ఈ చర్చలు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి.
అదే సమయంలో మొజాంబిక్, టాంజానియా, మయన్మార్ ప్రభుత్వాలతో పప్పుల దిగుమతికి ఒప్పందం కుదుర్చుకున్నది. ఇదిలా ఉండగా.. ఇటీవల క్రిసిల్ నివేదిక సైతం జూన్ తర్వాత కూరగాయలు తగ్గుతాయని పేర్కొంది. భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసిందని పేర్కొంది. జూన్ వరకు సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తుందని నివేదిక తెలిపింది. దాంతో కూరగాయల ధరలు రాబోయే కొద్దిరోజులు పెరగవచ్చని చెప్పింది. ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 30శాతం నుంచి 28.3శాతానికి తగ్గింది. గతేడాదితో పోలిస్తే 8.4శాతం ఎక్కువగా. పెరుగుతున్న ధరలపై ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ గతంలో ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

