Womens T20 World Cup Final : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యమిస్తున్న మహిళల టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి చేరింది. ఉత్కంఠ భరితంగా సాగిన తొమ్మిదో సీజన్లో విజేత ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. గత సీజన్ రన్నరప్ దక్షిణాఫ్రికా (South Africa) , తొలి సీజన్ రన్నరప్ న్యూజిలాండ్ (Newzealand) జట్లు తొలి కప్ కోసం అమీతుమీకి సిద్దమయ్యాయి. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ లారా వొల్వార్డ్త్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థిని తక్కువకే కట్టడి చేయడమే తమ ఉద్దేశమని లారా చెప్పింది.
తొలిసారి 2009లో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఫైనల్లో అడుగుపెట్టాయి. అయితే.. టైటిల్ పోరులో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించి తొలిసారి చాంపియన్ అయింది. 2010లో సైతం కివీస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో కంగుతిని మరోసారి రన్నరప్‌గా ఇంటిముఖం పట్టింది.
A first-time winner beckons in a battle of the underdogs 🏆
🔗 https://t.co/7XCxeCUu1l | #T20WorldCup pic.twitter.com/014TQhdL3F
— ESPNcricinfo (@ESPNcricinfo) October 20, 2024
న్యూజిలాండ్ జట్టు : సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కేర్, సోఫీ డెవినె(కెప్టెన్), బ్రూక్ హల్లిడే, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్(వికెట్ కీపర్), రోస్మెరీ మైర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జొనాస్.
దక్షిణాఫ్రికా జట్టు : లారా వొల్వార్డ్త్(కెప్టెన్), తంజిమ్ బ్రిట్స్, అన్నెకె బొస్చ్, క్లొయె ట్రయాన్, మరినే కాప్, సునే లుస్, నడినె డిక్లెర్క్, అన్నేరీ డిరిక్సెన్, సినాలో జఫ్తా(వికెట్ కీపర్), నొన్కులులెకొ లబా, అయబొంగ ఖాకా.
ఇక ఎనిమిదో సీజన్లో దక్షిణాఫ్రికా, ఆసీస్‌లు ఫైనల్లో తలపడ్డాయి. అయితే.. సఫారీల మొదటి ఐసీసీ ట్రోఫీ ఆశలపై నీళ్లు చల్లుతూ మేగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా ఆరోసారి చాంపియన్‌గా నిలిచింది. నిరుడు చేజారిన కప్‌ను ఒడిసి పట్టేసేందుకు సఫారీ జట్టు ఈసారి ఫైనల్‌కు దూసుకొచ్చింది. దాంతో.. గెలుపు ఎవరిది? అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.