అహ్మదాబాద్: హాస్పిటల్‌లోని కంటి రోగులను ఒక వ్యక్తి రాత్రి వేళ నిద్ర లేపాడు. మొబైల్ ఫోన్లో వారి వివరాలు నమోదు చేసి బీజేపీ సభ్యులుగా చేర్చుకున్నాడు. (BJP membership to eye patients) ఒక రోగి రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్లో ఈ సంఘటన జరిగింది. రాజ్‌కోట్‌లోని రాంచోడ్ దాస్ ట్రస్ట్ హాస్పిటల్ వార్డులో కంటికి శస్త్ర చికిత్స కోసం సుమారు 350 మంది రోగులు ఉన్నారు. రాత్రివేళ వారు నిద్రిస్తుండగా ఒక వ్యక్తి ఆ వార్డులోకి వచ్చాడు. మొబైల్ ఫోన్లో వారి వివరాలు నమోదు చేశాడు. వారి మొబైల్‌కు ఓపీటీ వచ్చింది. ఆ తర్వాత ‘మీరు బీజేపీ సభ్యులయ్యారు’ అన్న మెసేజ్ అందింది. ఒక రోగి దీని గురించి నిలదీయగా ‘బీజేపీ సభ్యత్వం లేని వారిని ఎవరూ రక్షించరు’ అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు.
కాగా, ఆ వార్డులోని ఒకరు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో బీజేపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గుజరాత్ బీజేపీ ఉపాధ్యక్షుడు గోర్ధన్ జడాఫియా దీనిపై స్పందించారు. ఈ సంఘటనకు తమ పార్టీ ప్రమేయం లేదని తెలిపారు. ప్రజలను ఈ విధంగా బీజేపీలోకి చేర్చుకోమని ఎవరినీ ఆదేశించలేదని చెప్పారు. ఒకవేళ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నట్లయితే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
A fresh controversy has erupted over the BJP membership campaign in #Gujarat. A viral video shows patients at a Rajkot hospital, who were there for eye surgery, being roused from sleep at night and recruited as BJP members. @NewIndianXpress @santwana99 @Shahid_Faridi_ pic.twitter.com/PjqsZQyPmr
— Dilip Singh Kshatriya (@Kshatriyadilip) October 19, 2024