అమరావతి : ఏపీలోని కృష్ణా జిల్లాలో (Krishna District ) విషాదం చోటుచేసుకుంది. క్వారీ గుంతల్లో (Quarry pits) పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. గన్నవరం మండలం మాదలవారిగూడెంలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు( Engineering students ) క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లారు. గుంతలు లోతుగా ఉండడాన్ని గమనించక విద్యార్థులు నీటిలో దిగారు.
ప్రమాదవశాత్తు నీటిలో పడి తిరువూరుకు చెందిన దుర్గాప్రసాద్, హైదరాబాద్(Hyderabad) కు చెందిన వెంకటేశ్ రాజు అనే ఇద్దరు విద్యార్థులు మరణించగా మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాలను స్థానికుల సహాయంతో బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.